Quantcast
Channel: Telugu News, తెలుగు వార్తలు, Latest Telugu News, Telugu News Today Live, Telugu Varthalu, ఈరోజు వార్తలు, Online Telugu News, తెలుగు న్యూస్ లైవ్ - Samayam Telugu

Ap Elections Live Updates: పవన్ కళ్యాణ్ నామినేషన్‌కు డేట్ ఫిక్స్

$
0
0
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అవడంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈనెల 25 వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లకు సమయం కేటాయించారు. ఈనెల 26 నామినేషన్ల పరిశీలన ఉండనుండగా.. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29. అలాగే.. మే 13న పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతంది. జూన్ 4వ తేదీన ఫలితలు వెల్లడికానున్నాయి.నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థుల వాహనాలను రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్న కార్యాలయానికి 200 మీటర్ల దూరంలోనే నిలిపివేస్తారు. అలాగే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయం లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపుతో పాటు దాఖలు చేసే ప్రాంతంలో పూర్తిగా అధికారులు వీడియో రికార్డింగ్ చేయనున్నారు. అలాగే పబ్లిక్ హాలీడేస్, ఆదివారం రోజున నామినేషన్ల స్వీకరణ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఇవాళ, ఈనెల 22, 25 తేదీలు మంచి రోజులు కావడంతో ఎక్కువ నామినేషన్‌లు వేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి నామినేషన్ ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి దాఖలైంది. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ నామినేషన్‌ దాఖలు చేశారు. * ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర కొసాగుతోంది. ఇవాళ బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్‌ ఉదయం 9 గంటలకు ఎస్‌టీ రాజపురం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.* ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఆలూరులో పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే జంక్షన్‌ సభలో చంద్రబాబు పాల్గొంటారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, అభ్యర్థి వీరభద్రగౌడ్‌ తెలిపారు. ఆలూరు సభ అనంతరం చంద్రబాబు అనంతపురం జిల్లా రాయదుర్గం సభకు హాజరవుతారు.* టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 20న తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు గూడూరులో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. మధ్యాహ్నం రెండు గంటలకు సర్వేపల్లిలో జరిగే సమావేశంలో, సాయంత్రం సత్యవేడులో జరిగే సభలో ప్రసంగిస్తారు. * మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. పిఠాపురం శాసన సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్ ఈ నెల 23వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు జనసేన పార్టీ తెలిపింది. పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కు పవన్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడలో బహిరంగ సభ నిర్వహిస్తారు.

విప్రోకు దెబ్బ మీద దెబ్బ.. మొత్తం 24 వేల మంది ఉద్యోగులు అవుట్.. ఈసారి 6 వేలకుపైగా..!

$
0
0
: భారత ఐటీ దిగ్గజ సంస్థలకు గడ్డుకాలం నడుస్తోంది. ఆర్థిక మందగమనం భయాలు, అనిశ్చితితో అంతా గందరగోళం నెలకొంది. ముఖ్యంగా దిగ్గజ కంపెనీల్లో కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారత ఐటీ సంస్థలు ఇప్పుడు నాలుగో త్రైమాసికం ఫలితాల్ని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ వరుసగా ఏప్రిల్ 12, ఏప్రిల్ 18న ఫలితాల్ని ప్రకటించాయి. రెండూ అంచనాల్ని మించే రాణించాయి. లాభం, ఆదాయం పెరిగింది. అయితే ప్రధాన సమస్యల్లా ఉద్యోగులు కంపెనీల్ని వీడుతుండటం. అదే అట్రిషన్ రేటు.. అంటే సిబ్బంది వలసలు అన్నమాట. అంటే కంపెనీల్ని వీడి ఇతర కంపెనీలకు చేరే ఉద్యోగుల శాతం. గత కొంత కాలంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య ఎన్నడూ లేని విధంగా ప్రతి త్రైమాసికంలో తగ్గుకుంటూ వస్తోంది. మార్చి త్రైమాసికంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 1759 తగ్గగా.. ఆర్థిక సంవత్సరం మొత్తంలో కూడా ఉద్యోగుల సంఖ్య పడిపోవడం 19 ఏళ్లలో తొలిసారి. ఇక ఇన్ఫోసిస్‌లో సమీక్షా త్రైమాసికంలో 5423 మంది ఉద్యోగులు కంపెనీని వీడగా.. ఇక్కడ 23 ఏళ్లలో ఇలా ఉద్యోగులు తగ్గడం తొలిసారి కావడం గమనార్హం.ఇక ఇప్పుడు విప్రోలో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వరుసగా ఆరో త్రైమాసికంలో కూడా ఇక్కడ ఉద్యోగుల సంఖ్య పడిపోయింది. జనవరి నుంచి మార్చి వరకు విప్రోలో 6180 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. అట్రిషన్ రేటు తగ్గించుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్న తరుణంలోనూ ఉద్యోగుల సంఖ్య ఇంతలా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.ఫుల్ ఇయర్ బేసిస్‌లో చూసినట్లయితే మొత్తం ఉద్యోగుల సంఖ్య 24,516 పడిపోయింది. మొత్తం విప్రోలో ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 2,34,054 గా ఉంది. ఇక విప్రో అట్రిషన్ రేటు 12 నెలల సమయంలో 14.2 శాతానికి పెరగడం గమనార్హం. మొత్తంగా టీసీఎస్ ఏడాది వ్యవధిలో 13,249 మంది తగ్గిపోయారు. ఇన్ఫోసిస్‌లో ఏకంగా 25,994 మంది ఉద్యోగులు తగ్గారు. విప్రో ఫలితాల సందర్భంగా ఇన్వె్స్టర్లకు మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేరుపై రూ. 1 డివిడెండ్ ప్రకటించింది. ఇక ఇతర కంపెనీలతో పోలిస్తే విప్రోను ఎన్నో సవాళ్లు పరీక్షిస్తున్నాయి. కంపెనీ సీఈఓ థియరీ డెలాపోర్టే కూడా ఇటీవల రాజీనామా చేయగా.. ఏప్రిల్ నెలలోనే శ్రీని పల్లియా ఆ బాధ్యతల్లోకి వచ్చారు. అంతకుముందు పలువురు సీనియర్ ఉద్యోగులు, ముఖ్య పదవుల్లో ఉన్న వారు కంపెనీని వీడటం గమనార్హం.

తలనొప్పితో చనిపోయిన డాక్టర్.. మైగ్రేన్ అంత డేంజరా?

$
0
0
: ఇటీవలి కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో మైగ్రేన్‌ చాలా తీవ్రమైనది. ఇది ఒకరకమైన తలనొప్పే అయినప్పటికీ.. సాధారణంగా తలకు ఒక వైపున మాత్రమే వస్తూ ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో తలకు రెండు వైపులా నొప్పి వస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ 24 ఏళ్ల లేడీ డాక్టర్.. తీవ్రమైన కారణంగా నిద్రలోనే చనిపోయిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఆమెకు తప్ప ఇతర అనారోగ్య సమస్యలేవీ లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె తరచూ మైగ్రేన్‌తో బాధపడుతూ ఉండేదని పేర్కొన్నారు. దీంతో మైగ్రేన్ ప్రాణాలు తీస్తుందా అనే ప్రశ్న ప్రస్తుతం ఈ విషయం విన్న ప్రతీ ఒక్కరిలో తలెత్తుతోంది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 24 ఏళ్ల డెంటిస్ట్ తీవ్రమైన తలనొప్పితో మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను పరిశీలించిన డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం.. స్వాతి శెట్టి తన తల్లితో రాత్రి ఫోన్‌ మాట్లాడిందని.. తనకు బాగా తలనొప్పిగా ఉందని.. తర్వాతి రోజు మాట్లాడుతానని ఫోన్ పెట్టేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత రాత్రి ఆమె నిద్రపోయింది. తర్వాతి రోజు తెల్లవారుజామున స్వాతి శెట్టిని లేపడానికి ఆమె రూమ్‌మేట్ ప్రయత్నించింది. ఎంత లేపినా లేవకపోవడంతో స్వాతి శెట్టిని పట్టుకుని చూడగా.. ఆమె శరీరం మొత్తం చల్లగా మారింది. వెంటనే ఆ రూమ్‌మేట్ స్వాతి శెట్టిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న స్వాతి శెట్టి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. స్వాతి శెట్టికి కేవలం మైగ్రేన్ సమస్య మాత్రమే ఉందని.. అంతకుమించి ఎలాంటి అనారోగ్యం లేదని స్పష్టం చేశారు.

మైగ్రేన్ మనుషులను చంపేస్తుందా?

ఈ ఘటనతో మైగ్రేన్ కారణంగా ప్రాణాలు పోతాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికన్ మైగ్రేన్ ఫౌండేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. మైగ్రేన్ కారణంగా గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని.. వాటి కారణంగా హార్ట్ ఎటాక్స్ వస్తాయని పేర్కొంది. అయితే వాపు, రక్తం గడ్డకట్టడం, ధమనుల లైనింగ్‌తోపాటు ఇతర అనేక సమస్యల వల్ల ఈ మైగ్రేన్ వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.ఇక మైగ్రేన్‌కు హార్ట్ స్ట్రోక్‌కు సంబంధం ఉందని తేల్చారు. . మైగ్రేన్‌ ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. మైగ్రేన్, ఇస్కీమిక్ స్ట్రోక్ మధ్య ఉన్న సంబంధానికి సంబంధించి ఎన్నో అధ్యయనాల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఎందుకంటే మైగ్రేన్, ఇస్కీమిక్ స్ట్రోక్ రెండూ రక్తనాళాల సరఫరాకు సంబంధించిన సమస్యలే కావడం గమనార్హం. మైగ్రేన్ మయోకార్డియల్ ఇన్‌ఫ్రక్షన్‌, స్ట్రోక్ కార్డియోవాస్కులర్ డెత్ ప్రమాదాన్ని సైతం పెంచుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మెడికల్ టెస్ట్‌లు చేయకుండా కొంతమంది రోగులలో స్ట్రోక్, మైగ్రేన్ మధ్య తేడాను గుర్తించడం కష్టమని డాక్టర్లు చెబుతున్నారు.

బాలకృష్ణ కంటే ఆయన భార్య వసుంధర ఆస్తులే ఎక్కువ.. ఎంతో తెలుసా?

$
0
0
Nomination: సినీ హీరో, ఎమ్మెల్యే హిందూపురం అసెంబ్లీ స్థానానికి మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. 2014, 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి వరుసగా గెలుపొందిన బాలయ్య.. హ్యాట్రిక్ లక్ష్యంగా మూడోసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి మూడోసారి కూడా తనదే గెలుపని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆర్వో ఆఫీసులో వసుంధరతో కలిసి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.మరోవైపు నామినేషన్ దాఖలు సందర్భంగా ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన బాలకృష్ణ అందులో తన ఆస్తులు, అప్పుల వివరాలు సమర్పించారు. ఎన్నికల ఆఫిడివిట్‌లో నందమూరి బాలకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆయన (Nandamuri Balakrishna) ఆస్తుల విలువ 81 కోట్ల 63 లక్షలు. ఇక బాలకృష్ణ సతీమణి (Nandamuri Vasundhra) ఆస్తుల విలువ వచ్చేసి 140 కోట్ల 38 లక్షల 83 వేలు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ () ఆస్తుల విలువ 58 కోట్ల 63 లక్షల 66 వేలుగా చూపారు. అప్పుల సంగతికి వస్తే తనకు 9 కోట్ల 9 లక్షల 22 వేలు.. తన భార్య వసుంధర పేరిట 3 కోట్ల 83 లక్షల 98 వేలు అప్పు ఉన్నట్లు బాలకృష్ణ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన నందమూరి బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రి ఎన్టీఆర్‌ ఆశయ సాధనే లక్ష్యంగా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికీ హిందూపురంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేశామని తెలిపారు, నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు వేశామని గుర్తు చేశారు. అలాగే అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించినా హిందూపురంలో రోజుకి 400 మందికి భోజనాలు ఏర్పాటు చేసిన సంగతిని బాలకృష్ణ వివరించారు. ఇక నందమూరి కుటుంబమంటే హిందూపురం వాసులకు ప్రత్యేక అభిమానమని చెప్పిన బాలకృష్ణ.. వరుసగా తనను రెండుసార్లు గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మూడోసారి కూడా ఆశీర్వదించాలని కోరారు. మరోవైపు హిందూపురంలో బాలయ్యను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో వైసీపీ ప్రత్యేక వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో బీసీ ఓటర్లను, రెడ్డి సామాజికవర్గానికి ఆకర్షించాలనే లక్ష్యంతో దీపికను వైసీపీ బరిలో నిలుపుతోంది. మరి హిందూపురం ఓటర్లు ఏం చేస్తారనేదీ జూన్ నాలుగో తేదీన తెలుస్తుంది.(ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై మీ అభిప్రాయాన్ని ద్వారా తెలియజేయండి)

Tirumala: తిరుమల అడవుల్లో అగ్నిప్రమాదం.. వారి పనేనా?

$
0
0
: శేషాచలం అడవుల్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పార్వేట మండపం సమీపంలో ఉన్న శ్రీగంధం ప్లాంట్‌లో శుక్రవారం మంటలు చెలరేగాయి. తిరుమల నుంచి పాప వినాశనం మార్గంలో ఈ పార్వేట మండపం ఉంది. ఈ పార్వేట మండపానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలోనే శ్రీవారి కోసం శ్రీగంధం చెట్లు పెంచుతోంది. అగ్నిప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లు, రెండు వాటర్ ట్యాంకుల సాయంతో మంటలను అదుపుచేశారు. అయితే అగ్నిప్రమాదం కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్మేసింది. మరోవైపు మంటలు ఎలా చెలరేగాయనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా అనే దానిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు ఎండాకాలం కావటంతో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువ. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. శేషాచలం అటవీ ప్రాంతం ఎంతో విలువైన వృక్ష, జంతు సంపదకు నిలయం. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు జరగకుండా ఫారెస్ట్ సిబ్బంది చర్యలు తీసుకోవాలనేది భక్తుల కోరిక. అటు టీటీడీ సైతం ఇప్పటికే దీనిపై చర్యలు చేపట్టింది. మంటలు వ్యాపించకుండా అక్కడక్కడా మట్టిరోడ్లు వేశారు. అలాగే ఎండిన చెట్లను సైతం తొలగిస్తున్నారు. అయినప్పటికీ అగ్ని ప్రమాదం జరగటంతో అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు.

20 ఏళ్లకే భర్తని వదిలేశా.. పెళ్లి ఎప్పుడైందో గుర్తేలేదు.. బాబుకి 22 ఏళ్లు.. పాపకి 19 ఏళ్లు: ‘త్రినయని’ ఫేమ్ తిలోత్తమ

$
0
0
త్రినయని సీరియల్‌లో తిలోత్తమగా విలనిజం పండిస్తున్నపవిత్ర జయరామ్. తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. కన్నడ నటి అయిన పవిత్రా జయరామ్ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. ఆమెకు ఓ కూతురు కొడుకు ఉన్నారు. పెద్దగా చదువుకోలేకపోవడంతో.. హౌస్ కీపర్‌గా.. సేల్స్ గర్ల్‌గా.. లైబ్రరీ అసిస్టెంట్‌గా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చింది పవిత్రా జయరామ్. ఆ తరువాత తెలిసిన వాళ్ల ద్వారా ఓ కన్నడ దర్శకుడి దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. మెల్లమెల్లగా సీరియల్స్‌లో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వెళ్లింది. తెలుగులో మొదటిగా ‘నిన్నేపెళ్లాడతా’ సీరియల్స్‌లో అవకాశం అందుకుంది పవిత్రా జయరామ్. త్రినయని సీరియల్‌తో పేరు సంపాదించుకుంది పవిత్రా జయరామ్ తన భర్తతో విభేదాల గురించి.. తన పిల్లల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో. పొట్ట కూటి కోసం హైదరాబాద్ వచ్చాను. కన్నడ కంటే తెలుగులో నాకు ఎక్కువ ఆదరణ లభించింది. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది కూడా తెలుగులోనే. ఈ త్రినయని సీరియల్.. కన్నడలో కూడా డబ్బింగ్ అవుతుంది. దాంతో కన్నడలో ఫాలోయింగ్ పెరిగింది. అంతకు ముందు చాలా కన్నడ సీరియల్స్‌లో చేశాను కానీ.. ఈ సీరియల్‌కి వచ్చిన పేరు అయితే రాలేదు. నా పేరుతో చాలా ఫ్యాన్ పేజ్‌లు కూడా వచ్చేశాయి. మ్యారేజ్ నాకు ఎప్పుడో అయిపోయింది. నాకు పెళ్లి అయ్యినరోజు కూడా గుర్తులేదంటే.. మీరు అర్ధం చేసుకోవచ్చు. నాకు పెళ్లి కావడం కాదు.. పాపా బాబూ కూడా ఉన్నారు. బాబుకి 22 ఏళ్లు.. పాపకి 19 ఏళ్లు. పెళ్లి ఎప్పుడో అయ్యింది.. ఎప్పుడో పోయింది.. హ్యాపీగా ఉన్నా. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది నాకు మెసేజ్‌లు పెడుతుంటారు. మేడమ్ నన్ను పెళ్లి చేసుకుంటారా? అని.. వాటిని చూసి నవ్వొస్తుంటుంది. నాకు ఇంకా ఆఫర్లు ఇస్తున్నారా? అని. ఆ మెసేజ్‌లో లోలోపల ఎంజాయ్ చేస్తుంటా. నాకు ఇప్పటికీ ప్రపోజ్‌లు వస్తుంటాయి. నా కూతురితో కాలేజ్‌కి వెళ్తే మీ అక్కా అని అడుగుతారు. అందుకే అది.. కాస్త వయసు కనిపించేట్టు రా.. చీర కట్టుకుని రా అని అంటుంది. నేను పదో తరగతి పూర్తి చేయగానే.. 16 ఏళ్లకే పెళ్లి చేసేశారు. చదువు అక్కడే ఆగిపోయింది. మ్యారేజ్ లైఫ్ ఎండ్ అయిపోయింది. చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే నా కూతురు కొడుకుని తీసుకుని బెంగుళూరు వచ్చేశాను. పిల్లల్ని పెంచడం కోసం చాలా పనులు చేశాను. హౌస్ కీపింగ్ చేశాను.. నర్సింగ్ కాలేజ్‌లో లైబ్రరీలో చేశాను.. కానీ ఎక్కడికి వెళ్లినా కూడా.. ఒంటరి ఆడది అనేసరికి చిన్న చూపు ఉండేది. పైగా అప్పటికి నాకు వయసు 22 ఏళ్లే. నేను సింగిల్ అనేసరికి చాలా ఇబ్బంది పెట్టేవారు. పిల్లల్ని చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఆ టైంలో నాకు నా స్నేహితుడి సాయంతో డాక్యుమెంటరీ డైరెక్టర్ దగ్గర షూటింగ్‌కి జాయిన్ అయ్యాను. అక్కడికి వెళ్లిన తరువాత నా లైఫ్ మారిపోయింది. ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చారు త్రినయని విలన్ తిలోత్తమ అలియాస్ .

భారీ చేపను చేతిలో పట్టుకున్న స్మృతి ఇరానీ.. చైత్ర నవరాత్రి వేళ ఆమె అలా చేశారా?

$
0
0
: ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీలు, నేతలు తమ తమ నియోజకవర్గాల్లో జోరుగా పర్యటనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలతో ప్రచారాన్ని ఉర్రూతలూగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో ఫోటోలు, వీడియోలు మీడియా, సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారుతున్నాయి. అయితే అందులో కొన్న నిజమైనవి ఉండగా.. మరికొన్ని ఫేక్ వీడియోలు, ఫోటోలు ఉంటున్నాయి. ఇక కొన్ని గతంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఎన్నికల వేళ.. వైరల్ చేస్తూ ఉన్నారు. తాజాగా కేంద్రమంత్రి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె చైత్ర నవరాత్రుల వేళ.. చేతిలో చేపను పట్టుకున్నారంటూ ఓ ఫోటో వైరల్ కాగా.. దానిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఫోటోలపై ఫ్యాక్ట్ చెక్ చేయగా అసలు విషయం బయటపడింది.

అసలు ఏం వైరల్ అవుతోంది?

కేంద్రమంత్రి, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీకి సంబంధించి రెండు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఒక ఫోటోలో ఆమె ఓ భారీ చేపను పట్టుకోగా.. మరో ఫోటోలో దుర్గా దేవి ఫోటోను పట్టుకుని ఉన్నారు. అయితే ఈ కార్యక్రమం చైత్ర నవరాత్రుల సందర్భంగా జరిగిందని పేర్కొంటూ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఒక ఫోటోను 2024 ఏప్రిల్ 15 వ తేదీన పోస్ట్ చేశాడు. ఒకే ఫ్రేమ్‌లో దుర్గాదేవి, భారీ చేపను పట్టుకోవడం.. అది కూడా వేళ ఏంటని క్యాప్షన్ ఇచ్చాడు.

అసలు నిజం ఏంటి?

వైరల్ అవుతున్న స్మృతి ఇరానీ ఫోటోలను విశ్వాస్ న్యూస్ అనే ఫ్యాక్ట్‌చెక్ సంస్థ ఫ్యాక్ట్ చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. ఆ ఫోటోల్లో ఉన్నది కేంద్రమంత్రి స్మృతి ఇరానీనే అని తేల్చారు. అంతేకాకుండా ఆమె ఒకసారి చేపను, మరోసారి దుర్గాదేవి ఫోటోను పట్టుకున్నది కూడా నిజమేనని గుర్తించారు. అయితే ఏప్రిల్ 6 వ తేదీన చెన్నై నార్త్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో భాగంగా తమిళ జాలర్లు.. ఓ భారీ చేపను స్మృతి ఇరానీకి బహుమతిగా ఇచ్చినట్లు మొదటి ఫోటో తీసినట్లు తేల్చారు. ఇక రెండో ఫోటో విషయానికి వస్తే అదే రోజు.. చెన్నై నార్త్ నియోజకవర్గం, తిరువల్లూరులో జరిగిన ప్రచారానికి సంబంధించి స్మృతి ఇరానీ చేసిన పోస్ట్ ద్వారా విషయం తెలిసింది. ఆ సమయంలో దుర్గామాత ఫోటోను తనకు బహూకరించినట్లు స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. చైత్ర నవరాత్రి ఏప్రిల్ 9 వ తేదీ నుంచి ప్రారంభం అయిందని.. అయితే ఈ ఫోటోలు చైత్ర నవరాత్రికి 3 రోజుల ముందు తీసినట్లు వెల్లడైంది. అంటే ఒకే వేదికపై ఈ రెండు సంఘటనలు జరగలేదని.. అంతేకాకుండా అది జరిగింది కూడా చైత్ర నవరాత్రి సందర్భంగా కాదని స్పష్టమైంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటో తప్పుదోవ పట్టించేదిగా ఉందని విశ్వాస్ న్యూస్ తన ఫ్యాక్ట్‌చెక్‌లో తేల్చింది.

వెరిఫికేషన్ అండ్ మెథడాలజీ

వైరల్ అవుతున్న ఫోటో నిజమా కాదా అనే విషయాన్ని తేల్చేందుకు పలు రకాల ప్రయత్నాలు చేసింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఆ ఫోటోను సెర్చ్ చేయగా.. దానికి సంబంధించిన కొన్ని మీడియా కథనాలు కనిపించాయి. అందులో ఏప్రిల్ 6 వ తేదీన జరిగినట్లు వెల్లడైంది. అంతేకాకుండా స్మృతి ఇరానీ ట్విటర్ ఖాతాలో సెర్చ్ చేయగా.. ఆమె నార్త్ చెన్నై, తిరువల్లూరు ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. మరోవైపు.. చెన్నైకి చెందిన జర్నలిస్ట్ ప్రభాకరన్ తమిళరసు కూడా ఆ రెండు ఫోటోలు ఏప్రిల్ 6 వ తేదీన జరిగినట్లు ధ్రువీకరించారు.

తీర్పు

చైత్ర నవరాత్రి సమయంలో స్మృతి ఇరానీ చేపను పట్టుకున్నారని వైరల్ అవుతున్న ఫోటోల్లో ఎలాంటి వాస్తవం లేదని విశ్వాస్ న్యూస్ తేల్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని వెల్లడైంది. అయితే చైత్ర నవరాత్రికి ముందే జరిగిందని తేల్చారు.(This story was originally fact checked by and translated & edited by Samayam Telugu, as part of the Shakti Collective)

అంబానీ బర్త్‌డే.. లక్షల కోట్ల ఆస్తి.. 27 అంతస్తుల భవంతి.. ఆయన జీతం ఎంతో తెలుసా?

$
0
0
Ambani Antilia House: .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయిల్ కంపెనీలతో మొదలుపెట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. వ్యాపార ప్రస్థానం ఇప్పుడు అన్ని రంగాలకు విస్తరించడంలో ఈయన కృషి ఎనలేనిది. ఇటీవలి కాలంలో టెలికాం, రిటైల్ రంగాల్లోనూ దూసుకెళ్తోంది. ఇతర పెద్ద పెద్ద సంస్థలకు పోటీగా బ్రాండ్లను తీసుకొస్తున్నారు అంబానీ. భారత్‌లో ప్రస్తుతం అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన ఆస్తి 113 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 9.50 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. ఇవాళ అంబానీ 67వ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయన జీవితం గురించి.. ఇతర విశేషాల గురించి చూద్దాం.తన వ్యాపార ప్రస్థానంలో ఎన్నో ఘనతల్ని సాధించారు ముకేశ్ అంబానీ. ప్రస్తుతం భారత్‌లో మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నం.1 గా ఉంది. ఈ సంస్థ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు అంబానీ. ఈ క్రమంలోనే ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. పక్కా వ్యూహాలతో ప్రత్యర్థులకు అందకుండా దూసుకెళ్లారు. దిగ్గజ వ్యాపారవేత్త ధీరూబాయ్ అంబానీ పెద్ద కుమారుడే ముకేశ్ అంబానీ. యెమెన్‌లోని అడెన్‌లో 1957, ఏప్రిల్ 19న ముకేశ్ జన్మించారు. తర్వాత వీరి కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయింది. ముకేశ్ అంబానీకి భార్య నీతా అంబానీ.. ముగ్గురు పిల్లలు ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ (కూతురు), అనంత్ అంబానీ ఉన్నారు. వీరు ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోని వివిధ విభాగాల బాధ్యతలు చూస్తున్నారు. నీతా అంబానీ ఇన్ని రోజులు రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, బోర్డు సభ్యురాలిగా ఉండగా.. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ యాజమాన్య బాధ్యతలు చూస్తున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ బాధ్యతలు కూడా ఈమెనే చూసుకుంటున్నారు. ఆకాశ్ అంబానీ రిలయన్స్ జియో, ఇషా రిలయన్స్ రిటైల్, అనంత్ రిలయన్స్ ఎనర్జీ బాధ్యతలు చూసుకుంటున్నారు.

అంబానీ ఫేవరేట్ కెఫే..

ముకేశ్ అంబానీ అంత పెద్ద వ్యాపారవేత్త కాబట్టి క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. అయితే ఆయనకు కూడా కొన్ని అభిరుచులు ఉంటాయి. అందుకోసం ఎందరో షెఫ్‌లతో ప్రత్యేకంగా వంటలు చేయించుకుంటుంటారు. ఇంకా ముకేశ్ అంబానీకి ముంబైలో ఫేవరేట్ కెఫే ఏంటో తెలుసా.. కెఫే మైసూర్. తరచుగా అక్కడికి వెళ్తుంటారు. తన హీరో, స్ఫూర్తి తన తండ్రేనట. తన తండ్రి రూ. 100 చేతిలో పెట్టుకొని ముంబై వచ్చి.. బిజినెస్‌లో సక్సెస్ అయ్యారని ఒక సందర్భంలో చెప్పారు.

నో శాలరీ..

ముకేశ్ అంబానీ కరోనాకు ముందు వరకు దాదాపు ప్రతి సంవత్సరాలు ప్రతి ఏటా రూ. 15 కోట్ల చొప్పున వేతనం తీసుకున్నారు. అయితే కరోనా తర్వాతి నుంచి ఆయన అసలు వేతనం తీసుకోలేదట. అంటే జీరో శాలరీ అన్నమాట. అయితే జీతం తీసుకోకున్నా.. కొన్ని ప్రత్యేకమైన భత్యాలు చెల్లిస్తుంది. ట్రావెలింగ్, లాడ్జింగ్, బిజినెస్ ట్రిప్స్, బోర్డింగ్, కార్ ప్రొవిజన్స్, ఫోన్ బిల్స్ వంటివి రీయంబర్స్‌ చేస్తారు. అంబానీ కుటుంబం సహా ఆయనకు అయ్యే భద్రతా ఖర్చుల్ని కూడా కంపెనీనే భరిస్తుంది. అంబానీకి ముంబై ఆంటిలియాలో 27 అంతస్తుల అతిపెద్ద భవనం ఉంది. ఇందులోనే సకలసౌకర్యాలు ఉంటాయి. దీంట్లో వందల మంది పనివాళ్లు ఉంటారు. ప్రతి ఒక్కరికీ నెల జీతం రూ. 2 లక్షలపైనే ఉంటుందని గతంలో పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వచ్చాయి.

నటుడు రఘుబాబు అరెస్ట్.. బీఆర్ఎస్ నేత మృతి కేసులో బిగిసిన ఉచ్చు

$
0
0
సీనియర్ నటుడు అయ్యారు. బీఆర్‌ఎస్‌ నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్‌రావు యాక్సిడెంట్ కేసులో నల్గొండ రెండో పట్టణ పోలీసులు రఘుబాబుని అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే బెయిల్‌పై విడుదలయ్యారు నటుటు రఘుబాబు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన 51 ఏళ్ల సందినేని జనార్దన్ రావు.. BRS టౌన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన కొంతమందితో కలిసి పట్టణ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద దత్త సాయి వెంచర్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి వస్తుండేవారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా హైదరాబాదు నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న BMW కారు జనార్దన్ రావు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు.ప్రమాదానికి కారణమైన కారులో నటుడు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన మరో కారులోకి మారారు. ఆ సమయంలో రఘుబాబుతో కొంత మంది స్థానికులు మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును వారు చర్చించుకుంటున్నారు.ఇదిలా ఉంటే, మృతుని భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. జనార్దన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామం. ఆయనకి భార్య నాగమణి, కుమార్తె, తనయుడు ఉన్నారు. కాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సందినేని జనార్దన్‌రావుకు టీఆర్ఎస్ ప్రముఖులు నివాళులర్పించారు. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రి.. సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

అమ్మతనం కోసం ఆరాటం.. ఆ చిలుకూరి బాలాజీయే ఉక్కిరిబిక్కిరి.. సంతానలేమి సమస్య ఇంత తీవ్రంగా ఉందా..?

$
0
0
'అమ్మా..' అనే పిలుపు మహిళల జీవితంలో ఎంతో అమూల్యమైనది. అమ్మతనంతోనే తమ జీవితం పరిపూర్ణవుతుందని ఎంతో మంది మహిళలు నమ్ముతారు. ఒక మహిళ తన జీవితం ఎన్ని పాత్రలు పోషించినా.. తల్లి పాత్ర అన్నింటికంటే గొప్పదని చెప్తుంటారు. అయితే.. ప్రస్తుతమున్న సమాజంలో.. అమ్మతనం అనేది చాలా మంది మహిళలకు అంత సులువుగా దొరకట్లేదు. ఈ రోజుల్లో.. సంతాన లేమి సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. పెళ్లైన ఎన్నో జంటలు సంతానం కోసం ఏళ్లపాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కనపడిన దేవున్నళ్లా మొక్కటం.. వినిపించిన ప్రతి డాక్టర్‌ను వెళ్లి కలవటం.. చేపించుకొమ్మన్న ట్రీట్మెంట్లన్నీ చేపించుకోవటం.. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసినా.. చాలా మంది దంపతులు.. పెళ్లి జరిగి సంవత్సరాలు గడిచినా సంతానం లేక దిగులు చెందుతూ.. మానసికంగా కుంగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

వైఫల్యానికి అసలు కారణమిదే..!

ఈ ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి.. ఈరోజు జరిగిన చిలుకూరు బాలాజీ ఆలయంలో గురుడ ప్రసాద పంపిణీ కార్యక్రమమే పెద్ద ఉదాహరణ. ఏప్రిల్ నెల మొదట్లో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్.. మీడియా వేదికగా ఓ పిలుపునిచ్చారు. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల సందర్భంగా.. ఏప్రిల్ 19న ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుందని.. ఆ రోజు గరుత్మంతునికి నైవేద్యం సమర్పించనున్నట్టు వివరించారు. ఆ నైవేద్యాన్ని సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు వితరణ చేస్తామని.. ఆ ప్రసాదం కోసం ఏప్రిల్ 19న ఉదయం 8 గంటల వరకు ఆలయానికి రావాలని చెప్పారు. ఎన్ని వందల మంది వచ్చినా.. ప్రతి ఒక్కరికీ ఈ ప్రసాదాన్ని వితరణ చేస్తామని రంగరాజన్ చెప్పుకొచ్చారు.

సంతానలేమి సమస్య ఈ స్థాయిలో

అయితే.. రంగరాజన్ ఇచ్చిన బైట్ మీడియా ఛానల్స్‌లో ప్రసారం కాగా.. అందుకు సంబంధించిన క్లిప్పులు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ రూపంలో తెగ వైరల్ అయ్యింది. ఒక మహిళకు తెలిసిన ఈ విషయాన్ని.. తన పరిధిలో సంతానలేమితో ఉన్న మహిళందరికీ షేర్ చేయటం.. తమ బంధువులను కూడా ఓసారి వెళ్లిరండి అంటూ సూచించటంతో.. ఈ గరుడ ప్రసాద వితరణ కార్యక్రమం జనాల్లోకి పెద్ద ఎత్తున చేరింది. కట్ చేస్తే.. ఈరోజు భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయింది. ఇసుకెస్తే రాలనంత జనం ఆలయానికి వచ్చారు. గరుడ ప్రసాదం తీసుకునేందుకు.. కేవలం హైదరాబాద్ వాసులతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జంటలు.. వారితో పాటు ఏపీ, కర్ణాటక నుంచి చాలా జంటలు రావటం గమనార్హం. కొందరైతే.. ముందు రోజే వచ్చి అక్కడే నిద్రించి వేకువజామునే రెడీ అయ్యి.. లైన్‌లో నిల్చున్నారంటే.. సంతానం కోసం ఎంతగా తపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

సుమారు 2 లక్షల మంది భక్తులు..!

ప్రసాదం కోసం ఎంత మంది వచ్చారన్నది సంఖ్యల్లో చెప్పటం కొంచెం కష్టమే కానీ.. ఆలయానికి వచ్చిన భక్తుల వాహనాలతో సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా.. ఆలయం నుంచి మొదలుకుని హిమయత్‌నగర్ గ్రామం వరకు ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలు ఇంకెన్నో. అయితే.. సుమారుగా ఒకటిన్నర నుంచి 2 లక్షల మంది వరకు భక్తులు వచ్చినట్టుగా భక్తులు నోటి లెక్కలు వేసుకుంటున్నారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. కేవలం గరుడ ప్రసాదం ఆరగిస్తే.. స్వామివారి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని నమ్మి వచ్చిన.. జంటలే ఇన్ని ఉంటే.. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి.. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్లు ఇంకా ఎంత మంది ఉంటారన్నది తలుచుకుంటే.. మనసు కకావికలమవుతోంది.

అడుగడుగునా సౌకర్యాల లేమి..

ఇదంతా ఇలా ఉంటే.. ఆలయ అర్చకులు పిలుపునిచ్చారు సరే.. కానీ ఇంత మంది వస్తారని మాత్రం కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే.. ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ గరుడప్రసాదాన్ని వితరణ చేస్తుంటారు. కానీ.. ఇలా ఇసుకేస్తే రాలనంత జనం రావటం ఎప్పుడూ జరగలేదు. మహా అయితే.. 10 వేల నుంచి 15 వరకు వస్తారని అంచనా వేసుకుని ఉంటారు. అందుకే.. పెద్దగా జాగ్రత్తలు కానీ.. సౌకర్యాల కల్పన కానీ చేయలేదు. ఆ విషయం అక్కడ.. అడుగడుగా బోదపడుతోంది. వాళ్లు ఊహించలేకపోవటానికి మూల్యం భక్తులే చెల్లించుకోవాల్సి వచ్చిందనుకోండి.

తొక్కిసలాటలో మహిళలు..

అయితే.. అర్చకులు చెప్పినట్టుగా 8 గంటల వరకు ఉండాలని చెప్తే.. చుక్క పొద్దుతోనే జంటలు వచ్చి అక్కడ బారులు తీరటం పరిస్థితికి అద్దం పట్టింది. కాగా.. తొలుత ఆలయానికి వచ్చిన దంపతులంతా ప్రసాదం కోసం వేచి ఉన్నారు. వచ్చిన భక్తుల సంఖ్యను చూసి.. ఆలయ సిబ్బందికి ఏమనిపించిందో కానీ.. కేవలం ఆడవారిని మాత్రమే లోపలికి పంపిస్తామని.. మగవారంతా బయటవేచి ఉండాలని తెలిపారు. దీంతో.. భార్యలను లైన్‌లో వదిలి భర్తలు బయట వేచి చూస్తూ ఉండిపోయారు. అయితే.. పెద్ద ఎత్తున మహిళలు వస్తుండటంతో.. నిర్వాహణ లోపమో లేదా అంతమంది వస్తారని ఊహించకపోవటమో కానీ.. స్వామి వారి దర్శనం సమయంలో భక్తుల మధ్య తోపులాటలు, తొక్కిసలాటలు జరిగాయి. ఆ తొక్కిసలాటలో చాలా మంది మహిళలు కింద పడిపోయి నలిగిపోయారు. చాల మంది మహిళలు ఊహిరాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ తొక్కిసలాటలో ఓ మహిళపై సుమారు పది మంది పడిపోవటంతో కాలు విరిగినట్టు సమాచారం.

ప్రసాదం తీసుకోకుండానే వెనక్కి..

ఇక.. దర్శనమై ప్రసాదం కోసం కూడా మూడు ద్వారాల గుండా పంపించటంతో ఒక్కసారిగా రద్దీ ఎక్కువైపోయి.. అక్కడ కూడా అదే సీన్ రిపీటైంది. చాలా మంది మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అన్ని గంటలు లైన్‌లో కష్టాన్ని ఓర్చుకుని నిల్చున్నా.. చివరికి ప్రసాదం ఇచ్చే సమయానికి తట్టుకోలేక బోరున ఓడుస్తూ చాలా మంది మహిళలు బయటికి వచ్చారు. కాగా.. మిగతా వారందరికీ ప్రసాదం దొరికినా.. వాళ్లకు కూడా కన్నీళ్లు తప్పలేదు.

నెట్‌వర్క్ లేకపోవటం పెద్ద ఇబ్బంది..

భార్యలు లోపలికి వెళ్లేప్పుడు వాళ్లకు మొబైల్ ఫోన్లు ఇచ్చి పంపించగా.. దర్శనం పూర్తయ్యాక ఫోన్ చేస్తారులే అన్న దీమాలో భర్తలు ఉన్నారు. కానీ.. అసలు విషయమేమిటంటే.. సుమారు ఏడున్నర సమయం నుంచి చిలుకూరు ఆలయ పరిధిలో సుమారు రెండు కిలోమీటర్ల రేడియస్‌లో సిగ్నల్స్ మొత్తం జామ్ అయిపోయాయి. దీంతో.. కమ్యూనికేషన్ పూర్తిగా స్తంభించిపోయింది. ఫలితంగా.. భర్త ఎక్కడ ఉన్నాడో భార్యకు తెలియక.. భార్య ఎప్పుడు వస్తుందో తెలియక భర్త తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆలయంలో నుంచి ఒకటే ఎగ్జిట్ ఉండగా.. అక్కడే భర్తలంతా పోగవటంతో.. తమవారిని గుర్తించటం అటు భార్యలకు, భర్తలకు అగ్నిపరీక్షగా మారింది.

తప్పిపోయి కన్నీళ్లు..

పైనుంచి ఎండ.. ఒళ్లంతా చెమటలు పోస్తున్నా తమ వారి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చాలా మంది ఒకరినొకరు కలుసుకోలేక తప్పిపోయారు. దీంతో.. కన్నీళ్లు పెట్టుకుంటూ మహిళలు అక్కడే ఉన్న పోలీస్ కంట్రోల్ రూం వద్దకు వెళ్లగా.. అప్పుడు తేరుకున్న పోలీస్ సిబ్బంది.. స్పందించి మిస్సింగ్ ప్రకటనలు చేయటం ప్రారంభించారు. తమవారి కోసం అప్పటివరకు తీవ్రంగా శ్రమించగా.. మొదటి ప్రకటన విన్న భక్తులు కంట్రోల్ రూంకు పరుగులు తీశారు. అప్పటికీ చాలా మంది గంటల తరబడి కలుసుకోలే చాలా ఇబ్బంది పడటం.. బాధను కలిగించింది.

మాటే బంగారమాయే గోవిందా..

మరోవైపు.. ఈ మొత్తం కృత్యంలో ఆలయ సిబ్బంది మొదటి నుంచి ఎలాంటి అనౌన్స్ మెంట్లు కానీ.. భక్తులకు సూచనలు కానీ చేయకపోవటం గమనార్హం. ప్రసాదం కోసం ఎక్కడికి వెళ్లాలి.. దర్శనం కోసం ఎటు నుంచి వెళ్లాలి.. భక్తులు ఓపికగా ఉండండి అందరికీ ప్రసాదం అందుతుంది అని గానీ.. తోసుకోవద్దని చెప్పటం కానీ ఎలాంటి ప్రకటనలు చేయకపోవటం అక్కడున్న భక్తులను ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే.. ఈ ప్రసాదం తీసుకునేవారు.. ఉపవాసంతో ఉండాలని చెప్పటంతో.. మహిళలంతా ఏమీ తినకుండా వచ్చారు. కాగా ప్రసాదం అందుకునే సమయానికి వాళ్లు చేసి సాహసానికి తోడు ఎండ తీవ్రత, ఉక్కపోతతో.. శరీరంలో సత్తువలేక చాలా మంది స్పృహలు కోల్పోయారు. కాగా.. లోపల క్యూలైన్లు కూడా సరిగ్గా ఏర్పాటు చేయకపోవటంతో.. నీళ్లు అందించే సౌకర్యం కూడా లేదు. ఇది కూడా మహిళలను తీవ్రస్థాయిలో ఇబ్బందికి గురిచేసింది.

కనీసం నీళ్లు కూడా లేవు..

బయటికి వచ్చిన వాళ్లు ప్రసాదాన్ని ఆరగించి.. ఏమైనా ఎంగిలి పడదామంటే టిఫిన్ సెంటర్లలో టిఫిన్లు నిండుకున్నాయి. అలా కాదు.. ఏదైనా జ్యూస్ కానీ, కూల్ డ్రింక్ కానీ తాగి చల్లబడదామంటే అవి కూడా నిండుకోవటం గమనార్హం. పోనీ నీళ్లయినా తాగుతామంటే.. వాటర్ బాటిళ్లు కూడా అయిపోయి.. ఏమి చేయాలో తెలియని దుర్భర పరిస్థితి నెలకొంది. ఓ భక్తుడైతే.. దేవుడి కోసం 50 రూపాయలు పెట్టి (అది కూడా ఒక్కటి కాదు జంటగానే కొనాలంటా అంటే మొత్తం 100 రూపాయలు.. అది వాళ్ల రూల్ మరి అక్కడ) కొన్న కొబ్బరికాయను బయటే పగులగొట్టి.. తన భార్య దాహం తీర్చాడంటే.. పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కొట్టొచ్చినట్టుగా సిబ్బంది నిర్లక్ష్యం..

ఇంత జరుగుతుంటే.. అక్కడ పోలీస్ సిబ్బంది కానీ, వైద్య సిబ్బంది కానీ.. చీమ కుట్టినట్టు కూడా లేరంటే ఆశ్చర్య పడాల్సిన విషయమే. కాలు విరిగిన మహిళ నడవలేక ఏడుస్తుంటే.. కనీసం ఆమెకు ప్రథమ చికిత్స చేసే వైద్యుడు లేకపోవటం శోచనీయం. ఆ ఆఫీసర్ మెల్లిగా ఇంటి దగ్గర అన్ని పనులు చక్కబెట్టుకుని తీరిగ్గా 11 గంటలకు వచ్చి.. అక్కడే ఉన్న ఆశా వర్కర్లను.. ఏం ఏర్పాట్లు చేయలేదేంటీ అని అడగటం అవాక్కయ్యే విషయం. ఇక.. అక్కడక్కడా ఉన్న పోలీసులు.. ఏదో చేస్తున్నట్టుగా అటూ ఇటూ తిరగటానికి సరిపోయింది తప్ప.. చేసిందేమీ లేదు. ఇదంతా జరుతుందని బాహ్య ప్రపంచానికి తెలియకుండా నెట్‌వర్క్ లేకపోవటంతో.. ఈ దుర్భర పరిస్థితులేవీ మీడియాకు కూడా తెలియలేదు. దీంతో.. పోలీసులు కూడా పెద్దగా స్పందించలేదు. ఇక ట్రాఫిక్ జామ్ అయ్యిందన్న విషయం తెలుసుకుని చాలా ప్రశాంతంగా వాళ్లు కూడా 11 తర్వాతే.. హాడావుడిని ప్రదర్శిస్తూ వచ్చి చూడటం గమనార్హం. అయితే.. అంత హడావుడి నటించినా.. హిమాయత్ నగర్ గ్రామంలోనే నలుగురైదుగురు ట్రాఫిక్‌ను సరిచేస్తూ కనిపించారు తప్పా.. ఆలయానికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయకపోవటం చాలా దారుణం.

అంబులెన్సుకు కూడా దారి దొరకనంతగా..

బయట రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయ్యిందన్న విషయాన్ని మీడియాకు తెలిసింది కానీ.. ఆలయంలో తొక్కిసలాట జరిగిందని, అందులో చాలా మంది పరిస్థితి అనారోగ్యానికి గురయ్యారని తెలియలేదు. సుమారు 25 నుంచి 30 మంది మహిళలు అనారోగ్యానికి గురికాగా.. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రావాల్సిన అంబులెన్సులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోవటం మరింత బాధాకరం. పోలీసులు చేయవల్సిన పనులు.. భక్తులే చేసి అంబులెన్సులను ఆలయం వరకు చేర్చటం అభినందనీయం. మరోవైపు.. ఎక్కడా పెదవులు తడుపుకునేందుకు కూడా ఆలయం సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవటంతో.. రోడ్డువెంట మహిళా భక్తులు స్పృహ తప్పి పడిపోతుండటం చూసి.. చాలా మంది స్వచ్ఛందంగా నీళ్లు అందిచారు. హిమాయత్‌నగర్‌లో ముస్లిం సోదరులు వాహనదాలుకు, నడగదారుల దగ్గరికే వెళ్లి మరీ నీళ్లు అది కూడా చల్లని నీళ్లు ఇవ్వటం అభినందనీయం.

ఎవరిదీ మూర్ఖత్వం..?

అయితే.. ఈ మొత్తం సందర్భంలో సంతానలేమి సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది తెలియజెప్పటంతో పాటు.. ఆలయ యాజమాన్య నిర్వాహణ లోపం పాటు పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తుంటే.. అన్నింటి కన్నా ముఖ్యంగా.. ఏదైనా ఉందని తెలిస్తే ముందూ వెనక ఆలోచించకుండా ఎగబడిపోయే తత్వం జనాల్లో ఏ రేంజ్‌‌లో పెరిగిపోయిందన్నది స్పష్టమవుతోంది. ఇది జనాల మూర్ఖత్వమా లేదా నమ్మకమా లేదా జనాల బలహీనతను నమ్మకంతో ముడిపెట్టి ప్రాచుర్యం పొందాలనుకే పలువురు పెద్దలదా అన్నది ఆలోచించాల్సిన విషయం.