Quantcast
Channel: Telugu News, తెలుగు వార్తలు, Latest Telugu News, Telugu News Today Live, Telugu Varthalu, ఈరోజు వార్తలు, Online Telugu News, తెలుగు న్యూస్ లైవ్ - Samayam Telugu
Viewing all 81590 articles
Browse latest View live

నితీశ్ ఇంట్లో బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా!

$
0
0

బీజేపీ ఎంపీ, సినీ నటుడు శతృఘ్న సిన్హా మహాకూటమి విజయ సారథి నితీశ్ కుమార్ ను కలిసారు. ఆదివారం నాటి ఎన్నికల ఫలితాలతో మంచి జోష్ మీద ఉన్న నితీశ్ ను ఆయన స్వగృహానికి వెళ్లి మరీ సిన్హా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను గురించి నితీశ్ తో చర్చించారు. నితీశ్ పాలనలో బీహార్ అభివృద్ధి పథంలో ముందంజలో ఉందని.. అందుకే ప్రజలు మహాకూటమికి పట్టం కట్టారని విశ్లేషించారు. నితీశ్ తో బేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ మారతానని వస్తున్న వార్తలను కొట్టివేశారు. తాను చివరి వరకు బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. కమ్యూనిస్ట్ దిగ్గజం జ్యోతిబసు తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులున్న నేతగా నితీశ్ ను ఆయన అభివర్ణించారు. మహాకూటమి చేతిలో బీజేపీ పరాజయానికి కారణాలను ఇప్పటికైనా విశ్లేషించుకోవాలని.. ఓటమికి కారణమైన నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. బీజేపీలో ఉండి మహాకూటమిని పొగుడుతున్న తనపై అధిష్టాన పెద్దలు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారంటూ స్థానిక బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అనంతరం ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ ను కూడా కలిసి శుభాకాంక్షలు చెప్పారు.

Mobile AppDownload and get updated news


బీహార్ ఫలితాలు ఆ రాష్ట్రానికే పరిమతం

$
0
0

ఢిల్లీ: బీహార్ ఫలితాలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఈ ఫలితాలు తమకు చేదు అనుభావాన్ని మిగిల్చిన మాట వాస్తవమేనని కేంద్ర మంత్రి అంగీకరించారు. అయితే ఈ ఫలితాలను దేశం మొత్తానికి ఆపాదించలేమని. మోడీ పాలనకు బీహార్ ఫలితాలు రెఫరెండం అన్న మాటలకు తాను ఏకీభవించనని..దాని ప్రభావం ఆ రాష్ట్రం వరకే ఉంటుదన్నారు. బీహార్ లోని సామాజిక సమీకరణలు విపక్షాలకు కలిసి వచ్చాయని తెలిపారు. బీహార్ ఫలితాలపై ఆత్మపరిలీలన చేసుకొని రానున్న రోజుల్లో మరింత మొరుగుపడతామని కేంద్ర మంత్రి వెంకయనాయుడు వెల్లడించారు.

Mobile AppDownload and get updated news

ఎలా ఓడాం చెప్మా..?!

$
0
0

బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణాలు వెతికే పనిలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ బిజీగా ఉంది. ఈ మేరకు పార్లమెంటరీ బోర్డు పెద్దలు సోమవారం నాడు సాయంత్రం సమావేశం ఏర్పాటుచేసారు. మోడీతో పాటు అధ్యక్షుడు అమిత్ షా, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, రాజ్ నాధ్ తదితరులు సమావేశానికి హాజరైనవారిలో ఉన్నారు. బీహార్ పరాజయం నేపథ్యంలో వచ్చే ఏడు జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రచార ప్రణాళికను సమీక్షించాలని సమావేశంలో నిర్ణయించినట్లు చెపుతున్నారు. దాంతోపాటు, సమావేశంలో అధిక సమయం బీహార్ పరాజయం కారణాలను విశ్లేషించడంలోనే సాగింది. దేశంలోని ఆయా కీలకాంశాలపై నేతలు ఎలా పడితే అలా నోరు పారేసుకోకుండా, ఇకమీదటయినా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని సమావేశంలో కొందరు అభిప్రాయపడినట్లు సమాచారం.

Mobile AppDownload and get updated news

బాలీవుడ్ హీరో డైరెక్షన్ కోరిక

$
0
0

బాలీవుడ్ నటుడు అజయ్‌దేవ్‌గన్‌కు దర్శకత్వంపై ఇంకా మోజు తీరనట్లుంది. గతంలో యూ మీ అవుర్ హమ్ పేరుతో స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాని నిర్మించి చేతులు కాల్చుకున్నాడు. ఆ సినిమా ఆర్థికంగా ఆయనకు భారీ నష్టాల్ని మిగిల్చింది. దాంతో చాలా కాలంపాటు దర్శకత్వం ఊసెత్తని అజయ్.. ఇన్నాళ్లకి మరోసారి ఆ ప్రయత్నాల్ని ప్రారంభించాడు. ఆదివారమే స్వీయ నిర్మాణంలో సెట్స్‌పైకి తీసుకెళ్లిన శివాయ్ సినిమాకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అజయ్ దేవ్‌గన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాని తొలుత ప్రభుదేవా డైరెక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు దర్శకత్వం నుంచి పక్కకు తప్పుకోవడంతో అజయ్‌దేవ్‌గన్ కోపగించుకున్నట్లు, దాంతో తానే ఈ సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 'అఖిల్' భామ సయేషా సెహెగల్ ఈ చిత్రంతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తుంది. తొలుత ఆమె స్థానంలో శృతిహాసన్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఆమె ఈ సినిమాలో నటించడానికి నిరాకరించింది. దర్శకుడిగా హిట్‌ను అందుకోవాలనే అతడి కోరిక ఈ సినిమాతోనైనా నెరవేరుతుందో? లేదో? చూడాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.

Mobile AppDownload and get updated news

అక్కడ కుట్ర జరిగిందిట!

$
0
0

బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కుప్పకూలడం వెనక కుట్రజరిగిందని కేంద్ర మంత్రి ఉమా భారతి అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో కొందరు పనిగట్టుకుని బీఫ్ అంశాన్ని, అసహనానికి నిరసనగా అవార్డుల వాపసు అంశాన్ని తీసుకుని బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడమే ఓటమికి కారణంగా ఉమా భారతి విశ్లేషించారు. బీహార్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టకుండా ప్రణాళిక ప్రకారం ప్రత్యర్థులు కృషి చేసి విజయం సాధించారన్నారు. పార్టీలోని కొందరు నేతల తీరు పట్ల కూడా ఆమె తీవ్రంగా స్పందించినట్లు చెపుతున్నారు.

Mobile AppDownload and get updated news

అయ్యో దేవుడా.. మళ్లీ ఇంకో రైతా?!

$
0
0

తెలంగాణలో అప్పుల బాధతో చనిపోయే అన్నదాతల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా కరీంనగర్ జిల్లాలో మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. జమ్మికుంట మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన రాజయ్యగా ఆ రైతును గుర్తించారు. పడిన కష్టానికి, పెట్టిన పెట్టుబడికి అనుగుణంగా దిగుమతి రాక, ధరలు పలుకక రాజయ్య అప్పుల ఊబిలో కూరుకుపోయారు. తమ అప్పులు తీర్చమంటూ రోజూ ఒత్తిళ్లు పెరుగుతుండటంతో వేరే గతిలేక ఉరి వేసుకుని ఈ బలవన్మరణానికి పాల్పడ్డాడని అంటున్నారు.

Mobile AppDownload and get updated news

రవికుమార్‌ చౌదరి డైరెక్షన్‌లో కళ్యాణ్‌రామ్

$
0
0

కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన 'పటాస్' చక్కటి విజయాన్ని అందుకోగా.. 'షేర్' కథలో బలం లేకపోవడంతో పరాజయాన్ని చవిచూసింది. ఆది నుంచి జయాపజయాలకు అతీతంగా కెరీర్‌ను కొనసాగిస్తున్న కళ్యాణ్‌రామ్ తాజాగా మరో కొత్త సినిమాకి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. పిల్లా నువ్వ్వులేని జీవితం సినిమాతో గతేడాది సక్సెస్‌ల బాట పట్టిన దర్శకుడు ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రవికుమార్... గోపీచంద్‌తో సౌఖ్యం మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. కళ్యాణ్‌రామ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో ఓ కథను సిద్ధం చేసుకున్న రవికుమార్, ఇటీవలే అతడికి వినిపించినట్లు తెలిసింది. కథలోని కొత్తదనం నచ్చడంతో నందమూరి హీరో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. 'సౌఖ్యం' తర్వాత సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా టాక్ వినిపిస్తున్న ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలిసింది.


Mobile AppDownload and get updated news

మోహనా.. నీ నోటికో దండం!

$
0
0

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయానికి నేతలంతా తమకు తోచిన భాష్యాలు, కారణాలు వెతికేపనిలో పడ్డారు. అందరికన్నా ఒకడుగు ముందుకేసిన భాజపా ఎంపీ ఒకరు ఏకంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం (ఆర్.ఎస్.ఎస్.) అధినేతపైనే విల్లు ఎక్కుపెట్టి, అధిష్టానాన్ని విస్తుగొలిపేలా చేసారు. ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్ ఎన్నికలకు ముందు రిజర్వేషన్ల అంశంపై మాట్లాడారు. రిజర్వేషన్లు తీసివేయాల్సిందేననే రీతిలో మోహన్ భగవత్ ప్రసంగించిన సంగతి తెలిసిందే. దళిత, వెనకబడిన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న బీహార్లో ఈ అంశం ప్రత్యర్థులకు బాగా అక్కరకొచ్చింది. బీజేపీ వస్తే ఇక మనుగడ ఉండదనే భయాందోళనలను వారిలో ఈ వ్యాఖ్యలు రేకెత్తించాయంటూ బీజేపీ ఎంపీ హుకుమ్ దేవ్ నారాయణ యాదవ్ అభిప్రాయపడ్డారు. మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల వల్లే పార్టీ తీవ్రంగా ఓడిపోయిందని నిశితంగా విమర్శించారు. ఆర్.ఎస్.ఎస్., సంఘపరివార్ కనుసన్నల్లో మెలిగే బీజేపీ అధిష్టానం కూడా ఏనాడూ ఇంత తీవ్రంగా ఒక ఆర్.ఎస్.ఎస్.చీఫ్ పై విమర్శలు చేయలేదు. ఈ వ్యాఖ్యలు చేసిన హుకుమ్ దేవ్ నిన్న గాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. ఐదు సార్లు ఎంపీగా చేసిన అనుభవం ఆయనది.పూర్వపు ఎన్‌.డి.ఏ., ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఆయన పనిచేశారు.

Mobile AppDownload and get updated news


హమ్మా.. శత్రుఘ్నా ఇదా కారణం?!

$
0
0

బీహార్ ఎన్నికల్లో తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే.. ఎన్డీఏకు ఫలితాలు వేరేగా ఉండేవని సీనీ నటుడు, బీజేపీ అసంతృప్త ఎంపీ శతృఘ్న సిన్హా చెప్పారు. ఈ అంశంపై నేనేమీ స్వోత్కర్షలకు పోవడం లేదు.. నా మనసులో ఉన్నదే చెపుతున్నాను. బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా స్థానికులను పక్కకు తోసేసారు. అదే పరాజయానికి కారణమని చెప్పుకొచ్చారు. తనను కనుక సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉన్నట్లయితే కచ్చితంగా మార్పు కనిపించి ఉండేదని.. అదెలా ఉండేదో తాను చెప్పలేనప్పటికీ.. ఇప్పుడు వచ్చిన ఫలితాలకు భిన్నంగా మాత్రం ఉండి ఉండేదన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించకపోవడం పట్ల తానేమీ బాధపడటం లేదని, తన అభిమానులు, సన్నిహితులు, తన ఓటర్లు మాత్రం తప్పకుండా బాధపడి ఉంటారన్నారు. సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించకపోవడానికి తాను చేసిన పాపమేమిటని అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఇండియా టీవీ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో శత్రుఘ్న ఈ వ్యాఖ్యలు చేసారు. బీహార్ ఎన్నికల ముందు నుండి శతృఘ్న సిన్హా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు చెపుతున్నారు. ఆఖరుకు ప్రచారానికి కూడా ఆయన వెళ్లలేదు. ఆదివారం నాడు ఫలితాలు నిరాశాజనకంగా వెలువడుతూ.. పరాజయం పక్కా అయిపోయిన సమయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు కూడా శతృఘ్న తీరు పట్ల అసహనం ప్రకటించిన విషయం తెలిసిందే.

Mobile AppDownload and get updated news

జాతీయ పార్టీలను వరంగల్ ప్రజలు నమ్మరు

$
0
0

వరంగల్ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఓరుగల్లు ఉప ఎన్నిక లో ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా..టీఆర్ ఎస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. వరంగల్ ప్రజలు జాతీయ పార్టీలను నమ్మే పరిస్థితిలో లేరని వెల్లడించారు. చెత్త సేకరణ సేకరణలో భాగంగా హైదరాబాద్‌ లో చెత్త సేకరణ కొనుగోలు చేసిన ఆటో ట్రాలీలను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ నెలాఖరు కల్లా ఇంటికి చెత్త బుట్టల పంపిణీ జరుగుతుందని వెల్లడించారు. ప్రతి ఇంటికి రెండు చొప్పున పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చెత్త తరలించేందుకు కొత్త ఆటో ట్రాలీలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో ఎక్కడా అపరిశుభ్రదతనేది కనబడకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం పథకం హైదరాబాద్ లో కూడా అమలు చేస్తున్నామని ..అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చాని వెల్లడించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న లక్ష మందికి ఇల్లు నిర్మించుకునేందుకు సర్టిఫెకెట్లు ఇచ్చామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

Mobile AppDownload and get updated news

మోడీ సంస్కరణలు వదిలేస్తారా?

$
0
0

బీహార్ ఎన్నికల పరాజయంతో ఖంగుతిన్న బీజేపీ ప్రభుత్వం సంస్కరణల బాట నుండి తప్పుకునే యోచనలో ఉందనే ప్రచారం ఆదివారం నుండి ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ ఘోరంగా దెబ్బతినడం ఒక్క బీజేపీనే కాదు.. విదేశీ పెట్టుబడీదారులను కూడా కుదిపేసింది. ఈ నేపథ్యంలో పార్టీని దేశంలో బతికించి.. రానున్న ఎన్నికలకు సిద్ధం చేసే బాధ్యత ప్రధాని మోడీ పైనే ఉంది. సర్వేలు కూడా ఈ మధ్య కాలంలో మోడీ ప్రతిష్ట మసకబారుతోందనే సూచనలు ఇస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మోడీ తాను ప్రారంభించిన సంస్కరణలను పక్కన బెట్టేయనున్నారనే ప్రచారం జరగడం పట్ల దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, బీజేపీ వర్గాలు దాన్ని కొట్టివేస్తున్నాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మోడీ సంస్కరణలను కొనసాగించితీరతారని అంటున్నాయి.

Mobile AppDownload and get updated news

రహానేకి ప్రమోషన్... రైనాకి డిమోషన్ !

$
0
0


26 మంది ఆటగాళ్లతో బీసీసీఐ రూపొందించిన 2015-16 యాన్యువల్ ప్లేయర్ కాంట్రాక్ట్స్ జాబితాలో బ్యాట్స్‌మన్ అజింక్యా రహానేకి ప్రమోషన్ లభించగా సురేష్ రైనా, భువనేశ్వర్ కుమార్‌ల స్థాయి తగ్గింది. ఈ జాబితాలో రహానేకి A గ్రేడ్‌లో చోటు కల్పించిన బీసీసీఐ, A గ్రేడ్‌లో కొనసాగుతున్న సురేష్ రైనా, భువనేశ్వర్ కుమార్‌లని B గ్రేడ్‌కి తగ్గించింది. కిందటేడాది B గ్రేడ్‌లో వున్న రవీంద్ర జడేజాకి C గ్రేడ్‌లో స్థానం కల్పించింది. ఇక ఎం.ఎస్. ధోనీ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్‌లని A గ్రేడ్‌లోనే కొనసాగించిన బీసీసీఐ... అంబటి రాయుడు, రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా, మురళీ విజయ్, శిఖర్ ధావన్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీలకి యధావిధిగా B గ్రేడ్ జాబితాలోనే చోటు కల్పిస్తున్నట్లు స్పష్టంచేసింది. ఇప్పటివరకు B గ్రేడ్‌లో కొనసాగుతున్న ప్రజ్ఞాన్ ఓజాకి ఈసారి జాబితాలో చోటు దక్కలేదు. అలాగే C గ్రేడ్‌లో వున్న ఇంకొంత మంది ఆటగాళ్ల పేర్లు కూడా జాబితాలో కనుమరుగయ్యాయి. హర్బజన్ సింగ్, శ్రీనాథ్ అరవింద్ లాంటి ఆటగాళ్లకి ఈ జాబితాలో C గ్రేడ్ లభించింది.

Mobile AppDownload and get updated news

బీహార్‌లో ఎన్డీఏ ఓడిపోవడానికి ఆ ఇద్దరే కారకులు -మాంఝీ

$
0
0


బీహార్ ఎన్నికల్లో ఓటమికి ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలే కారకులు అని అన్నారు ఆ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ ఏవం మోర్చ అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బీహార్ ఎన్నికల్లో పరాజయం పొందడానికి వీళ్లు ఇద్దరే బాధ్యులు అంటూ ఘాటు విమర్శలు చేశారు మాంఝీ. దళితులు, వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్లని కల్పించడంపై పునసమీక్ష అవసరం అన్న మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపాయని మాంఝి ఆరోపించారు. అలాగే బీహార్ ఎన్నికల్లో బీజేపి ఓడిపోతే, పాకిస్థాన్‌లో టపాసులు కాల్చుకుంటారన్న అమిత్ షా ప్రసంగం సైతం మహాఘట్‌బంధన్‌కే అనుకూలంగా పనిచేసింది అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. సరిగ్గా ఈ రెండు అంశాల్ని మహాఘట్‌బంధన్‌, ఎన్డీఏ కూటమిపై అస్త్రాలుగా వాడుకుని ఓటర్లని తమ వైపు తిప్పుకోవడంలో సఫలం అయిందని మాంఝి పేర్కొన్నారు. అందుకే బీహార్‌లో ఎన్డీఏ ఓటమికి ఆ ఇద్దరి వైఖరి కారణమని స్పష్టంచేశారు మాంఝి.

Mobile AppDownload and get updated news

ఎనర్జీ డ్రింక్స్ యమ డేంజరట!

$
0
0

ఎనర్జీ డ్రింక్స్ వినియోగం వల్ల రక్తపోటు పెరగడంతోపాటు హృదయ సంబంధిత వ్యాధులకి దారితీసే ప్రమాదం వుందని తాజా అధ్యయనం స్పష్టంచేసింది. అమెరికాలోని మయో క్లినిక్ చేపట్టిన పరిశోధనలో ఈ ఫలితం తేలింది. 18 ఏళ్లు, అంతకుపైబడిన 25 మంది ఆరోగ్యవంతులైన యువకులకి 2 వారాలపాటు ఎనర్జీ డ్రింక్స్, ప్లేస్‌బో డ్రింక్స్(ఆల్కాహాల్, కెఫైన్ వంటి ఉత్ప్రేరకాలు లేనటువంటి ఇతర పానియం) అందించిన పరిశోధకులు, ఆ తర్వాత వారి శరీరంలో చోటుచేసుకున్న మార్పులని నమోదు చేశారు. ఎనర్జీ డ్రింక్స్‌లో వుండే కెఫైన్‌తోపాటు ఇతర ఉత్ప్రేరకాలు వారిలో రక్తపోటుని పెంచినట్లు పరిశోధకులు గుర్తించారు. అధిక రక్తపోటు కారణంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా వుందని పరిశోధకులు తేల్చిచెప్పారు. ప్లేస్‌బో డ్రింక్ తాగినప్పుడు శరీరంలోని కెఫైన్ లెవెల్స్‌లో ఎటువంటి మార్పు లేనప్పటికీ.. ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్నప్పుడు మాత్రం కెఫైన్ లెవెల్స్ అధికమవడమే ఈ పరిస్థితికి కారణమని సర్వే స్పష్టంచేసింది.

Mobile AppDownload and get updated news

జాగ్రత్త సుమీ.. తీరం దాటింది..!

$
0
0

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కడలూరు వద్ద సోమవారం సాయంత్రం తీరం దాటింది. ప్రస్తుతం పశ్చిమ దిశగా పయనిస్తోంది. వాయుగుండం తీవ్రమై ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు కురియనున్నాయి. ఈ ప్రభావం దక్షిణ తీరాంధ్ర జిల్లాలతోపాటు, రాయలసీమల్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వాయుగుండం వల్ల తమిళనాడు రాజధాని చెన్నై ఇప్పటికే జలమయమై జనజీవనం స్థంభించింది. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఈ కారణంగా అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. సోమవారం రాత్రి ఈ వార్త ప్రచురితమయ్యే నాటికి తీరాంధ్రలోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. వర్షం తాకిడికి పలు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో సముద్రపు అలలు అయిదు మీటర్ల ఎత్తుకు ఎగిరిపడుతున్నాయి. తుపాను వల్ల ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఆరుగురు చనిపోయారు.

Mobile AppDownload and get updated news


నగర భద్రత కోసం మరిన్ని సిసి కెమెరాలు

$
0
0

హైదరాబాద్: సచివాలయంలో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మతో డీజీపీ అనురాగ్ శర్మ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల అంశంపై చర్చ జరిగింది. నిఘా చర్యల్లో భాగంగా నగరంలో మరిన్ని సిసి కెమెరాల ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన కూడళ్లతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో సరిపడ సిసి కెమెరాలు లేనందున అసాంఘీక కార్యకలాపాలు యథేచ్చగా జరుగుతున్నయని..దీన్ని నివారించే క్రమంలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు.

Mobile AppDownload and get updated news

పర్యాటక ప్రాంతంగా గండికోట - చంద్రబాబు

$
0
0

రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసే వరకు నిద్రపోనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం ఉదయం గండికోటను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గండికోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. గండికోట సందర్శన అనంతరం చంద్రబాబు అనంతరపురం పర్యటనకు బయల్దేరారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డుమార్గంగుండానే బయల్దేరి వెళ్లారు. కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించిన చంద్రబాబు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

Mobile AppDownload and get updated news

ఇక్కడ సరే..మరి కర్నాటక సంగతేంటి ?

$
0
0

వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాటల యద్ధం కొనసాగుతోంది. తాజాగా అధికార పార్టీ ఎంపీ వినోద్ స్పందించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎంపీ వినోద్ మట్లాడుతూ టి.సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయన్నారు. ప్రభుత్వంపై అనవసరంగా బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. 16 నెలల కాలంలో రైతు రుణమాపీతో సహా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు.రైతు ఆత్మహత్యలకు కారణం గత ప్రభుత్వ విధానాలేని..ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. రైతు ఆత్మహత్యలపై గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్..తను పాలిత రాష్ట్రమైన కర్నాటకలో ఇక్కడకంటే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం మరిచారని విమర్శించారు . కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ తెలంగాణ సాధించారని..వరంగల్ సహా తెలంగాణ ప్రజలందరూ టీఆర్ ఎస్ వైపే ఉన్నారని వెల్లడించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ గెలుపు ఖాయమన్నారు.

Mobile AppDownload and get updated news

ఎఫ్.డి.ఐ., నిబంధనలిక మరింత సరళం

$
0
0

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్.డి.ఐ.,లు) కు సంబంధించి భారతదేశ విధానంలో పెద్ద ఎత్తున సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇంత విస్తృతంగా సంస్కరణలకు తీసుకు రావడం విశేషం. వ్యవసాయం, నిర్మాణరంగం, హోల్ సేల్ రిటైల్, ప్రైవేట్ బ్యాంకులు, ఏవియేషన్ అండ్ బ్రాడ్ క్యాస్టింగ్ లాంటి మొత్తం 15 సెక్టార్లలో ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నియమావళిని సులభతరం చేయనున్నారు. ఇప్పటికే గనులు, రక్షణ రంగాల్లో ఎఫ్డీఐలకు నిబంధనలు సరళతరం చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని బ్రిటన్ పర్యటన.. జీ-20 సమావేశం నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘోర పరాజయం పొందిన తరుణంలో మోడీ ప్రభుత్వం సంస్కరణలను పక్కన బెట్టేస్తుందనే భయాందోళనలు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తల్లో వ్యక్తమయ్యాయి. దానికి సమాధానంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని, సంస్కరణల పథం నుండి తాను వెనక్కు మళ్లబోమని దేశానికి సంకేతాలు ఇచ్చిందని కూడా అంటున్నారు. ఆరు నూరయినా సంస్కరణలు కొనసాగిస్తామని చెప్పేందుకే బీహార్ ఎన్నికలు, బ్రిటన్ పర్యటన నేపథ్యంగా మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.

Mobile AppDownload and get updated news

భళ్లాల దేవ భార్య ఎవరో?!

$
0
0

భళ్లాల దేవుడిగా బాహుబలి తొలి భాగంలో ప్రభాస్ కు దీటుగా నటించిన రానాకు భార్యను వెతికేపనిలో చిత్ర యూనిట్ బిజీ గా ఉన్నారు. చిత్రం తొలి భాగంలో రానాకు పెళ్లయి ఒక కుమారుడు (అడివి శేషు) ఉన్నట్లు చెప్పినప్పటికీ, రానా భార్యను చూపలేదు. ఈ చిత్రానికి కొనసాగింపుగా రెండో భాగాన్ని రూపొందిస్తున్నారు. రెండో భాగంలో రానా భార్యను చూపనున్నారు. కథలో ఆమె పాత్ర కీలకమని అంటున్నారు. ఇదిలా ఉండగా, చిత్రంలో రానా భార్యగా సరిపోయే హీరోయిన్ కోసం చాలా రోజుల నుండి వెతుకుతున్నారు. మొదట శ్రియ నటిస్తుందన్నారు. కానీ అది నిజం కాదని ఆమె చెప్పింది. ఆ తరువాత లావణ్య త్రిపాఠి పేరు వినిపించింది. అది కూడా పుకారేనని చిత్ర యూనిట్ కొట్టేసింది. నిత్యామీనన్ ను తీసుకోవాలనుకున్నారు కానీ.. రానాతో ఆమె కాంబినేషన్ కుదరలేదుట. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నుండి ఎవరినైనా దిగుమతి చేసుకోవాలని రాజమౌళి యోచిస్తున్నారంటున్నారు.

Mobile AppDownload and get updated news

Viewing all 81590 articles
Browse latest View live