టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ అవార్డుల వేడుక (టోఫా) ఈ ఏడాదికి గానూ దుబాయ్‌లో నిర్వహించనున్నారు. ఇటీవలే బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, వరుణ్ ధావన్ మీడియాతో మాట్లాడుతూ టోఫా వేడుక మార్చి 18న దుబాయ్‌లో జరుగుతుందని చెప్పారు. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ వారి ఇంటర్నేషనల్ బిజినెస్ డైరెక్టర్ సమీర్ సోని మాట్లాడుతూ దుబాయ్‌లో టోఫా వేడుకలను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. పలువురు బాలీవుడ్ బిగ్ సెలెబ్రిటీల పవర్ ఫుల్ షోలతో ఈ సారి ధూంధాంగా వేడుక నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఈ షోను వీక్షించేందుకు టికెట్లు ticketmaster.ae.లో అందుబాటులో ఉంచారు. ఆన్‌లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చు. అవార్డుల వేడుకకు గల్ఫ్ ఎయిర్, సంజయ్ ఘోడావట్ గ్రూప్ భాగస్వాములుగా ఉన్నారు.