హైద్రాబాద్‌లో టీసీఎస్ ఉద్యోగి సోమవారం నుంచి కనిపించకుండాపోయిన సంగతి తెలిసిందే. ఆమె ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. మతిస్థిమితం తప్పి నగరశివార్లకు చేరుకుంది అనుశ్రీ. మెదక్ జిల్లా పటాన్ చెరుకు వెళ్లి, అక్కడ అనుమానాస్పద స్థితిలో తిరుగుతుంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని గుర్తించి ఆసుపత్రిలో చేర్చారు. అనూశ్రీ క్షేమంగా ఉందని తెలిసి ఆమె కుటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలోనే ఉంది.
Mobile AppDownload and get updated news