కేరళలోని కోచిలో భారత విద్యార్థి యూనియన్ (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా) సమావేశాలు రెండు రోజుల పాటూ జరుగుతున్నాయి. ఆ సమావేశాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థి నాయకులు హాజరయ్యారు. విద్యార్థుల సమస్యలు, కార్యాచరణపై చర్చలు జరిగాయి. ఆ సమావేశంలో ఓ యువకుడు సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు. అతను దేశంలోనే అతి పిన్న వయస్కుడైన మేయర్ దేవేంద్ర యాదవ్. ఛత్తీస్ ఘడ్ లోని బిలాయ్ కార్పోరేషన్ నుంచి మేయర్ గా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం ఇతని వయసు 27ఏళ్లు. ఆయన పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతూ, ఎన్నికల్లో పాల్గొన్నాడు. గెలిచి మేయర్ అయ్యాడు. సమావేశ ప్రాంతంలోకి అతను రాగానే విద్యార్థులంతా ఇట్టే గుర్తుపట్టేశారు. కోచిలోని స్టార్టప్ విలేజ్ లాంటిదే తన ప్రాంతంలో కూడా నెలకొల్పాలనుకుంటున్నాడు.
Mobile AppDownload and get updated news