Mobile AppDownload and get updated news
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం జరిగే వరకు... తాత్కాలిక సచివాలయాన్ని ముందుగా నిర్మించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. శాశ్వత నిర్మాణాలు పూర్తయ్యేవరకు రాష్ట్ర ప్రజలకు పరిపాలనాపరమైన సేవలను అందించేందుకు ఈ తాత్కాలిక సచివాలయాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వ ఆలోచన. తుళ్లూరులోని వెలగపూడి గ్రామంలో మొదట తాత్కాలిక సచివాలయ నిర్మాణం జరుగుతుంది. దీనిని 20 ఎకరాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పుడు 45.129 ఎకరాల్లో నిర్మించనున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీని 27 ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు, 18.47 ఎకరాల్లో ప్రజా భవనాలను నిర్మించనున్నారు. ఈ భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతోంది. కట్టడాలు ప్రారంభించిన ఆరునెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.