ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు తీసుకుని వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమైన అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వాసు వెంకటరావును, ఎండీ అవ్వాసు వెంకట శేషనారాయణరావులను సీఐడీ అరెస్టు చేసింది. గురువారం రాత్రి హైదరాబాద్ లో వారి అరెస్టు జరిగింది. ఉదయం ఏలూరు తీసుకెళ్లి అక్కడి మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా తమ దగ్గర తీసుకున్న అప్పు రూ. 105 కోట్లు చెల్లించకపోవడంతో ఆంధ్రాబ్యాంక్ పంజాగుట్టలోని అగ్రిగోల్డ్ కార్యాలయాన్ని సీజ్ చేసింది. దానిని వేలం వేస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ లోని హైకోర్టులో ఈకేసుపై నేడు విచారణ జరుగనుంది.
Mobile AppDownload and get updated news