ప్రేమకు కచ్చితమైన నిర్వహచనం ఇవ్వడం కష్టం..కానీ ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా..! ఆ ప్రయత్నంలో భాగమే ఇది..
ప్రేమంటే ఏనాటికి మరువలేని తీపి జ్ఞాపకం
భావాలతో ప్రకటించలేని అపురూప అనుభవం
ధైర్యాన్ని నూరిపోసే అదోటైపు ఇంధనం
సహనానికి అది ప్రతిరూపం
ప్రేమంటే తెరమీద నడిచే రెండు గంటల దృశ్యం కాదు
ప్రేమ అనేది ఏనాటికి అదృశ్యం కాదు
ప్రేమంటే కేవలం రెండు పదాల కలయిక కాదు
ప్రేమంటే రెండు నిండు హృదయాల కదలిక
Mobile AppDownload and get updated news