ఎవరీ అనుపమ.... ఏ సినిమాలో చేసింది? ఇప్పుడిదే టాలీవుడ్ టాక్. ఒక్క సినిమా కూడా చేయకుండానే... తెలుగులో పెద్ద సినిమా ఆఫర్లను కొట్టేస్తోంది అనుపమ పరమేశ్వరన్. మిగతా హీరోయిన్లందరూ అనుపమపై జెలస్ కూడా ఫీలవుతున్నారట. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో అ... ఆ... సినిమాలో నటిస్తోంది అనుపమ. అలాగే నాగచైతన్య సరసన మజ్నులో కూడా చేస్తోంది. ఇప్పడు మరో సినిమా కూడా వరసలో ఉందని సమాచారం. అలాగే కోలీవుడ్లో మరో భారీ ఆఫర్ కూడా వచ్చిందట. ధనుష్ తో 'కోడి' అనే సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ముందు ఆ పాత్రకి బేబీ షామిలీని అనుకున్నారు. ఏమైందో తనని తప్పించి అనుపమను చేర్చుకున్నట్టు సమాచారం. ఇంతవరకు ఆమె చేసిన సినిమా మళయాళంలో 'ప్రేమం' మాత్రమే. అది పెద్ద హిట్ కొట్టింది. అంతే అనుపమకు ఆఫర్ల మీద ఆపర్లు వచ్చేస్తున్నాయి. సో లక్కీ గర్ల్.
![]()
Mobile AppDownload and get updated news