అమెరికా అత్యున్నత న్యాయస్థానం జడ్జిగా ఓ ప్రవాస భారతీయుడు నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. యూఎస్ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న ఆంటోనిన్ స్కాలియా అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో ఆ పదవిని తిరిగి భర్తీ చేయాల్సి ఉంది. స్కాలియా వారసుడిగా ఇండియా నుంచి వెళ్లి చాలాఏళ్ల క్రితం నుంచి అమెరికాలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన శ్రీ శ్రీనివాసన్‌ను ఒబామా ప్రకటించే అవకాశం 99శాతం ఉన్నట్టు అక్కడి వర్గాల భోగట్టా. శ్రీనివాసన్ వయసు 48 ఏళ్లు. ఈయన ఛండీఘడ్ లో జన్మించినప్పటికీ... తల్లిదండ్రుల సొంత రాష్ట్రం తమిళనాడు. 1960లలోనే వీరు అమెరికా వెళ్లిపోయారు. శ్రీనివాసన్ కు జడ్జి పదవి దక్కితే... ఆ ఘనత సాధించిన మొదటి భారత సంతతి వ్యక్తిగా చరిత్రకెక్కుతారు. గతంలో ఈయన ఒబామా ప్రిన్సిపల్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గా కూడా పనిచేశారు.
Mobile AppDownload and get updated news