విజయవాడ: ఏపీ సర్కార్ పై వైసీపీ అధినేత జగన్ మరోసారి ఫైర్ అయ్యారు. కొంత మంది ధనిక వర్గాలను లబ్ది చేకూర్చేందుకు ప్రేదల ప్రయోజనాలను చంద్రబాబు ప్రభుత్వం పణంగా పెడుతోందని దయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో పేదలు నివసించే పరిస్థితి లేకుండా ఏపీ సర్కార్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా విజయవాడలోని రైవస్ కాలువ సమీపంలో ఉన్న మురికివాడను సోమవారం వైసీపీ అధినేత జగన్ సందర్శించారు. . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం రైవస్ కాలువపై ఇళ్లను తొలగించాలని అధికారులు నోటీసులు జారీ చేయడం అన్యాయమన్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను ఎలా కూల్చుతారని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో పేదల భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తే తాము ఊరుకునేదిలేదన్నారు. బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా జగన్ భరోసా ఇచ్చారు.
Mobile AppDownload and get updated news