Mobile AppDownload and get updated news
టాలీవుడ్ స్టార్స్‌కి కమల్ ఆహ్వానం అని టైటిల్ చూడగానే ఆయనేదో తన కూతురు శృతిహాసన్ పెళ్లి ఏమైనా పెట్టుకున్నాడా ఏంటి అని షాక్ అయ్యేరు. అటువంటిదేమీ లేదు కానీ తాను ఇటీవలే నటించిన చీకటి రాజ్యం మూవీ రిలీజ్‌కి రెడీ అయిన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్స్‌కి అందరికీ ఆహ్వానం పంపించి మరీ ప్రీమియర్ షో ఏర్పాటు చేశాడట కమల్. మూవీ యూనిట్ సభ్యులతోపాటు టాలీవుడ్ ప్రముఖులైన వెంకటేష్, నాగార్జున, అమల, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, వి.వి. వినాయక్, పూరి జగన్నాథ్, రాంచరణ్, రానా దగ్గుబాటి, సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు వంటి వాళ్లు కమల్ నుంచి ఆహ్వానం అందుకున్న వారిలో వున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చీకటి రాజ్యం మూవీని ఎలాగైనా సక్సెస్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న కమల్ అందులో భాగంగానే టాలీవుడ్ స్టార్స్‌ని ఈ ప్రీమియర్ షోకి ఆహ్వానించి వుంటాడనే టాక్ వినిపిస్తోంది.