కేంద్ర సహాయం అందాలంటే రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాల నివేదికను సమర్పించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ బీరేందర్ సింగ్ వెల్లడించారు. టి.సర్కార్ జాప్యం వల్లే తెలంగాణకు కేంద్ర సహాయం అందడం లేదని ఆయన ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కరువు మండాల జాబితాను నివేదిస్తే కేంద్ర సహాయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తమకు సకాలంలో నివేదిక అందితే రానున్న నాలుగేళ్లలో తెలంగాణ గ్రామ పంచాయితీలకు రూ.2 లక్షల కోట్ల వరకు సాయం అందే అవకాశముందని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బీరేందర్ సింగ్ వెల్లడించారు.
Mobile AppDownload and get updated news