వరదల కాణంగా నష్టపోయిన ఆంద్రప్రదేశను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ లో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు అతలాకుతలమైన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో పునరావసం, పునర్ నిర్మాణం పనులు చేపట్టేందుకు తక్షణ సాయం కింద వెయ్యి కోట్లు మంజూరు చేయాలని ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, రాధామోహన్ సింగ్ లకు సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రామిక అంచనా ప్రకారం భారీ వర్షాల వల్ల ఏపీకి రూ.3 వేల నష్టం జరిగినట్లు వెల్లడించారు. అధ్యయనం తర్వాత పూర్తి స్థాయి నివేదికను కేంద్రానికి పంపనున్నారు.
Mobile AppDownload and get updated news