Mobile AppDownload and get updated news
వేశ్యావాటికపై పోలీసులు దాడి చేస్తున్నారని తెలుసుకుని అక్కడి నుండి పారిపోదామని ప్రయత్నించిన వ్యక్తి పొరపాటున భవనంపై నుండి కిందకు పడి చావుబతుకుల్లో ఉన్నాడు. ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబయిలోని ఒక ప్రాంతంలో వ్యభిచారం జరుగుతున్నదనే సమాచారంతో సోషల్ సర్వీస్ బ్రాంచి పోలీసులు ఒక భవనంపై రైడ్ చేసారు. ఆ రైడ్స్ లో పోలీసులు ఇద్దరు బాలికలను రక్షించారు. వారిని బలవంతంగా వేశ్యావృత్తిలోకి దింపేందుకు నిర్వాహకులు యత్నిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఆ దాడిలో మరి కొందరు విటులను, నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసారు. ఆ భవనాన్ని ఊడ్చే ఉద్యోగాన్ని చేస్తున్న కుమార్ గౌడ పోలీసుల రాకకు భయపడి పారిపోబోతూ రెండతస్తుల పైనుండి జారి కిందకు పడిపోయి తీవ్రగాయాలపాలయ్యాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. అయితే అతడిని ప్రసాది మండల్ అనే పోలీస్ ఇన్ఫార్మరే కిందకు తోసాడని సెక్స్ వర్కర్లు ఆరోపిస్తున్నారు.