2011లో వచ్చిన రంగం చిత్రంతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో జీవా. ఆ తర్వాత తెలుగులో వచ్చిన స్నేహితుడు, మాస్క్, చిరునవ్వుల జిరుజల్లు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరోసారి అదే క్రేజ్‌తో 'పోకిరి రాజా' పేరుతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఫన్ ఆఫ్ విండ్ అనే ట్యాగ్ లైన్‌తో విడుదలకి సిద్ధమైన ఈ సినిమాలో హన్సిక జీవా సరసన హీరోయిన్‌గా నటించింది. తమిళంలో జీవా నటించిన 25వ చిత్రం కావడంతో నిర్మాతలు ఈ సినిమాని గ్రాండ్‌గానే రిలీజ్ చేయబోతున్నారు. రామ్ ప్రకాష్ రాయప్ప డైరెక్ట్ ఈ మూవీలో ప్రముఖ నటుడు సత్య రాజ్ తనయుడు సిబిరాజ్ విలన్‌గా నటించాడు. కామెడీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన పోకిరి రాజా మూవీని ఎస్.ఎస్.వి.ఎస్. క్రియేషన్స్ సమర్పణలో, సాయి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మలిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, వి.హానీ ప్రమోధ్ మరియు శ్రీను సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
Mobile AppDownload and get updated news