Vమావోయిస్టల చేత కిడ్నాప్ కు గురైన టీఆర్ఎస్ నేతలు క్షేమంగా తిరిగి వచ్చారు. పూసుగుప్ప అటవీ ప్రాంతంలో వీరిని మావోయిస్టుల వదిలి వెళ్లారు. దీంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మావోయిస్టుల చెర నుంచి విడుదల కావడంపై కుటుంబ సభ్యుడు, టీడీఆర్ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం రాత్రి భద్రాచలం టీఆర్ ఎస్ ఇన్ ఛార్జ్ రామకృష్ణ సహా చర్ల,వాజేడు,వెంకటాపురానికి చెందిన నేతలు పటేల్ వెంకటేశ్వర్లు, సురేష్ , జనార్థన్, సత్యనారాయణ, రామకృష్ణలను మావోయిస్టులు కిడ్పాప్ చేసిన విషయం తెలిసిందే. చర్ల మండలం బూచగుప్ప గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలుపై గ్రామస్థులతో చర్చిస్తున్న సమయంలో మావోయిస్టులు వారిని కిడ్నాప్ చేశారు.
Mobile AppDownload and get updated news