Mobile AppDownload and get updated news
ఆన్‌లైన్ సేవలు విస్తృతమవుతున్నాయి. ఒక్కొక్కటిగా అన్ని సేవలూ ఆన్‌లైన్లో అందుబాటులోకి వస్తున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి పెళ్లి రిజిస్ట్రేషన్లకు కూడా ఆన్ లైన్ సేవలు అందించడం మొదలుపెట్టింది. మ్యారేజీ సర్టిఫికెట్లను కూడా ఆన్ లైన్లోనే పొందొచ్చు. రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి పెళ్లి అయినట్టు సర్టిఫికెట్ కోసం మాన్యువల్ గా దరఖాస్తు చేసుకుని... దాని కోసం రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఇక ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ఇ-మిత్ర పేరుతో రాజస్థాన్లో 35,000 చోట్ల చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసి ప్రచారం చేయనున్నట్టు తెలిపారు. ఇ-మిత్ర ద్వారా ఆన్ లైన్లో సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే... కేవలం వారం రోజుల్లో సర్టిఫికెట్ వచ్చేస్తుందని చెప్పారు. ఈ మొత్తం ప్రాసెస్‌ను ద డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటస్టిక్స్ సంస్థ పర్యవేక్షిస్తుంది. వారం రోజుల కన్నా ఎక్కువ సమయం తీసుకుంటే ఆ సంస్థ... రిజిస్ట్రార్ ను ప్రశ్నిస్తుంది. రాజస్థాన్ ఐటీ డే చెప్పుకునే మార్చి 21 ఈ సేవలు ప్రారంభం అయ్యాయి. 2014, జనవరి 1 నుంచి బర్త్, డెత్ సర్టిఫికెట్లను ఆన్‌లైన్లో అందిస్తోంది రాజస్థాన్ ప్రభుత్వం.