హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రజాప్రతినిధుల జీతాల పెంపుకు సంబంధించిన చట్టసవరణ బిల్లును మంత్రి హరీష్ రావు సోమవారం ప్రశేపెట్టారు. మంత్రి ప్రవేశపెట్టిన బిల్లును సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో ఇక ప్రతి ఎమ్మెల్యేకు ప్రభుత్వం చేసే ఖర్చు 3 లక్షలకు చేరుకుంది. ఎమ్మెల్యే జీతం కింద రూ.20 వేలు, మిగిలిన అలవెన్స్ కింద రూ.2.3 లక్షలు ఇవ్వనున్నారు. అలాగే కారు భత్యం రూ.25 వేలు, బుల్లెట్ ప్రూఫ్ కారుకు రూ.30 వేలు ఇవ్వనున్నారు. అలాగే మంత్రుల జీతం కింద నెల రూ.30 వేలు, 8 వేల ప్రత్యేక భత్యం, 7 వేల అతిధి భత్యం ఇవనున్నారు.
Mobile AppDownload and get updated news