అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. తరగతి గదిలోనే ఇద్దరు విద్యార్థులు గొడవపడి కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఒక విద్యార్థి మరణించాడు. పూర్తి వివరాల ప్రకారం... బుక్కరాయ సముద్రంలోని ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఫేర్ వెల్ పార్టీ చేయాలనుకున్నారు. ఇందుకోసం మెకానికల్ విభాగం మూడో ఏడాది చదువుతున్న విద్యార్థుల క్లాసురూములో డబ్బులు వసూలు చేస్తున్నారు. వంశీధర్ అనే విద్యార్థి ధన్ రాజ్ అనే మరో విద్యార్థిని డబ్బులు అడిగాడు. ఆ క్రమంలో వారిద్దరికీ మాటమాట పెరిగి ఘర్షణ మొదలైంది. వంశీధర్ కోపంతో ధన్ రాజ్ ను చెవి కింద బలంగా కొట్టాడు. అది చాలా సున్నితమైన ప్రాంతం కావడంతో... ధన్రాజ్ అక్కడికక్కడే పడిపోయాడు. కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి హుటాహుటిన తరలించింది. అయితే అప్పటికే ధన్ రాజ్ మరణించినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు వంశీధర్ రెడ్డిని అరెస్టు చేశారు.
Mobile AppDownload and get updated news