మనం మాట్లాడేది ఇతరులకు వినిపించటం, ఏంచెబుతున్నామో అర్థం కావటం ఎంత అదృష్టమో చాలామందికి తెలీదు. అదేమిటో కాలిఫోర్నియాకు చెందిన డిల్లాన్ బర్మాఖ్ ను అడిగితే చెబుతాడు. ఎంతో ఉత్సాహంగా ఏదైనా చెప్పబోతే అది ఎవరికీ అర్థం అయ్యేది కాదు. మొదట్లో అందరూ తనతో ఎందుకు మాట్లాడటం లేదో అనుకునేవాడు చివరకు తను చెప్పేది అర్థం కావటం లేదని తెలిసి ఎంతో వేదనకు గురయ్యాడు. దీన్నే ఆటిజం అంటారు. తెలుగు పరిభాషలో మూగవ్యాధి అంటారు. కొందరు పిల్లలు ఎవరితోనూ కలవకపోవటం, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుండటం, సరిగా మాట్లాడలేకపోతుండటం వంటి భిన్న లక్షణాలను గమనించి.. 'లియో కానర్' అనే మానసిక విశ్లేషకుడు తొలిగా దీనికి 'ఆటిజం' అని పేరు పెట్టారు.శాస్త్రవేత్తలు దీనిని పర్వేసివ్ డెవలెప్ మెంటల్ డిజార్డర్ అంటారు. ఈ వ్యాధే డిల్లాన్ కు వచ్చింది. వేదనలో ఉన్న డిల్లాన్ ను వాళ్ల అమ్మ ఓదార్చింది. అతను చెప్పాలనుకున్నది టైప్ చేసి ఐప్యాడ్లో చెప్పేలా అలవాటుచేసింది. అయినా అతనిలో బాధ పోలేదు. చివరకు అతని సమస్యను యాపిల్ తీర్చింది. అతను టైప్ చేస్తే దాన్ని మాట్లాడి మనకు వినిపించే సాఫ్ట్ వేర్ ఉన్న ఐప్యాడ్ ను అతనికి అందజేసింది. అంతే అతని ప్రపంచమే దాంతో మారిపోయింది. ఇప్పుడు స్కూల్లో అతను ఓ స్మార్ట్ కిడ్.చక్కగా తన భావాలు తెలియజేయగల విద్యార్థి. స్వరం అనేది నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని ప్రపంచానికి తెలిపాడు. అతనికి తాము ఎలా సాయం చేశామో తెలుపుతూ యాపిల్ విడుదల చేసిన వీడియోలు ఎందరికో కళ్లలో ఆనందభాష్పాలను తెప్పించాయి.
డిల్లాన్ పాత్
డిల్లాన్ వాయిస్
Mobile AppDownload and get updated news