Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85948

మాక్‌టేల్: ఇంగ్లీష్ సినిమాకి కేజ్రీవాల్ రివ్యూ

$
0
0

నిత్యం రాజకీయాల్లో తలమునకలై ఎంతో బిజీగా వుండే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకి పబ్లిక్ డిమాండ్ మేరకు బ్యాట్‌మన్ వర్సెస్ సూపర్ మ్యాన్ మూవీపై సిన్సియర్‌గా ఓ రివ్యూ రాసి సినిమాకి 5 స్టార్స్‌కిగాను 1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించే ధర్నాలు, ర్యాలీలతో పోల్చుకుంటే ఈ సినిమా ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడంలో విఫలమైందని ఓ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారాయన. ఓసారి కేజ్రీవాల్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొని అక్కడున్న వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ నిరసనలో 45 మంది కార్యకర్తలు పాల్గొనగా 13 మంది అక్కడ నిలబడి చూస్తున్నారు. 475 మంది మీడియా సిబ్బంది కవరేజ్‌లో వున్నారు. మిత్రులారా.. ఇవాళరేపు ఆడియెన్స్‌కి ఎంతో యాక్షన్, డ్రామా, తెరపై ఆసక్తి కలిగించే ప్యాషన్ కావాలి. అది మనం వాళ్లకెప్పుడూ అందిస్తూనే వున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికొస్తే, నా ధర్నాలకి నేను 5 స్టార్స్‌కి 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. ఆ విషయాన్ని ఢిల్లీ వాసులు కూడా అంగీకరిస్తారు. మధ్యలో తన నెత్తిపై వున్న ఆమ్ ఆద్మీ పార్టీ టోపీని సవరించుకుంటూ... ఈ హాలీవుడ్ సినిమావాళ్లు తమ సినిమాలపై మిలియన్ డాలర్లు తగలేసి ఈ సినిమాల్ని ఆడియెన్స్ ముందుకు తీసుకువస్తారు. కానీ ఆ హాలీవుడ్ సూపర్ స్టార్ సినిమాలకన్నా మంచి వినోదాన్ని మేమే బాగా అందిస్తాం. ఈ సందర్భంగా ఆప్ నేతలు సోమ్‌నాథ్ భారతీ, అషుతోష్‌లని అభినందిస్తూ ఆ తర్వాత అషుతోష్ వైపు తిరిగిచూశారు కేజ్రీవాల్. కేజ్రీవాల్ ప్రసంగంతో ఒకింత అయోమయానికి గురైన అషుతోష్.. అర్ధం కాని నవ్వు ఒకటి ముఖంపై తెచ్చుకుని అక్కడున్న కార్యకర్తలవైపు చూస్తూ చేయి ఊపారు. ఇక ఈ కేజ్రీవాల్ ప్రజెంట్ చేసిన రివ్యూ హాలీవుడ్ క్రిటిక్స్‌కి అయోమయానికి గురిచేసింది. ఇదే విషయమై ఆ సినిమా దర్శకుడు జాక్ స్నైడర్‌ని సంప్రదించే ప్రయత్నంచేయగా... పరోక్షంగా జాక్ ఇండియాలోనే ఎక్కడో వున్నాడని సూచిస్తూ అతడి ఫోన్ అదేపనిగా స్విఛాఫ్ అని వచ్చింది. అయితే, జాక్ మాత్రం ఎస్ఎంఎస్ ద్వారా స్పందించాడు. కేజ్రీవాల్ ఇచ్చిన రివ్యూపై తాను స్పందించదల్చుకోలేదు. కానీ ఇండియాలోని రాజకీయాలపై డ్రామా థ్రిల్లర్ తెరకెక్కించాలని భావిస్తే, అందులో ఎవరిని నటీనటులుగా తీసుకోవాలో మాత్రం తనకి బాగా తెలుసు అని ఆ ఎస్ఎంఎస్‌లో పేర్కొన్నాడు జాక్. ఇదిలావుంటే, పంజాబ్‌లో రానున్న ఎన్నికలకి సంబంధించి ఒపినియన్ పోల్స్‌లో ఆప్ ముందంజలో వుందని తెలిసి కేజ్రీవాల్ దానిపై స్పందించారు. నేను ఎప్పుడూ చెబుతూనే వున్నా.. పంజాబ్‌లో ప్రజలు డ్రగ్స్ ప్రభావంలో వున్నారు అని. ఇప్పుడా విషయం మరోసారి రుజువైంది అని వ్యాఖ్యానించారు కేజ్రీవాల్.

మాక్‌టేల్ గమనిక : మిమ్మల్ని సరదాగా నవ్వించడం కోసమే ఈ కథనం. నిజజీవితంలో వ్యక్తులు, ఘటనలతో ఈ కథనానికి ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ ఫర్ ఫన్!

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85948

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>