అమెథీ నియోజక వర్గంలోని దలాయ్ గ్రామంలో నీళ్ల ట్యాంకు కూలిన ఘటనలో ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. ముసాఫిర్ ఖానా పోలీస్ స్టేషన్ పరిథిలోని ఈ గ్రామంలో శనివారం నాడు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ నీళ్ల ట్యాంకును స్థానికంగా నివసించే నిరుపేద కూలీలు, ఇతర వర్గాలకు చెందిన వారికోసం నిర్మించారు. శనివారం నాడు అకస్మాత్తుగా ఈ ట్యాంకు కూలిపోవడంతో దాని కింద ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే చనిపోయారు. మరో చిన్నారికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.
Mobile AppDownload and get updated news