విశాఖ సాగర తీరాన సోమవారం ఇంద్ర నేవీ - 15 విన్యాసాలు నిర్వహించనున్నారు. భారత్ -రష్యాలకు చెందిన యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో పాలుపంచుకోనున్నాయి. విన్యాసాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచే రష్యాకు చెందిన యుద్ధవిమానాలు విశాఖ తీరానికి రావడం మొదలు పెట్టాయి. దీంతో విశాఖ తీరాన సందడి వాతావరణ నెలకొంది. ఇదిలా ఉండగా రెండో దశ విన్యాసాలు ఈ నెల 10 న నిర్వహించనున్నట్లు నేవీ అధికారులు వెల్లడించారు.
Mobile AppDownload and get updated news