బాక్సైడ్ తవ్వకాలపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతప్రతంపై ఏపీ.పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి స్పందించారు. విశాఖలో సోమవారం జరిగిన కార్యక్రమంలో బాక్సైడ్ తవ్వాకాలపై వాస్తవ పత్రాలను రఘువీరా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాడ్లాడుతూ విశాఖ మాన్యంలో బాక్సైడ్ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం మోసపూరితమని ఆరోపించారు. ఇది గిరిజన హక్కులను కాలరాసే విధంగా ఉందని విమర్శించారు. ఆదివాసీల హక్కల దినోత్సవం రోజు.. వారి హక్కులను కాలరాసే శ్వేత పత్రం విడుదల చేయడం దేనికి సంకేతమో సీఎం చంద్రబాబు చెప్పాలని రఘువీరా డిమాండ్ చేశారు. గిరిజన ప్రయోజనాలను హరించే ఎలాంటి చర్యనైనా తాము అడ్డుకొని తీరుతామని ఏపీ.పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో పాటు పలు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
Mobile AppDownload and get updated news