సఫారీలతో జరుగుతున్న నాల్గో టెస్టులో కోహ్లీ సేన విజయానికి చేరువైంది. చివరి రోజు ఆటలో సఫారీలు 131 పరుగులకే ఐదు వికెట్ల కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 481 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు తొలి నుంచి డ్రా కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ భారత్ స్పిన్ దాటికి తట్టుకోలేక వరుసగా క్యూ కడుతున్నారు. సఫారీల తరఫున డివిలియర్స్ (42) మాత్రమే ఒంటరీ పోరాటం చేస్తున్నాడు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా..టీమిండియా గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. బౌలింగ్ విషయానికి వస్తే అశ్విన్ మూడు వికెట్లు తీయగా..జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకున్నట్లవుతుంది. ఇదే జరిగితే కోహ్లీ సేన చరిత్ర సష్టించినట్లే ..ఎందుకంటే గతంలో సఫారీలపై భారత్ ఎప్పడు ఇంతటి భారీ ఆధిక్యతను ప్రదర్శించలేదు. మరో వైపు ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ 4వ ర్యాంకు నుంచి రెండో స్థానానికి ఎగబాకుతుంది. దీంతో ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
Mobile AppDownload and get updated news