సీఆర్‌డీఏపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించి సమన్వయం చేసే కమాండ్ కంట్రోల్ సెంటర్ సీఎం ఛాంబర్ వద్దే ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం కార్యాలయానికి ఎంపిక చేసిన భవనంపై దాదాపు 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు. దీనికి సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. అలాగే అసెంబ్లీ భవనం, సచివాలయల భవన నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. భవన నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్ ను అధికారులు చంద్రబాబుకు వివరించారు. కాగా ఈ సమావేశంలో ఏపీ పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు
Mobile AppDownload and get updated news