అది సూరత్‌లోని వీఐపీ రోడ్. గ్రామీణ, నగర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలతో మొత్తం కిక్కిరిసిపోయి వుంది. సెప్టెంబర్ 17న నరేంద్ర మోడీ బర్త్ డే సందర్భంగా శనివారం అతుల్ బేకరీ వారు రూపొందించిన 2500 కేజీల చాకో బెర్రీ పిరమిడ్ కేక్‌ని కట్ చేసేందుకే మహిళలంతా అక్కడ గుమిగూడారు. దాదాపు 7 అడుగుల ఎత్తున్న ఈ కేక్‌ని రూ.15 లక్షలు వెచ్చించి, 30 మంది చెఫ్‌లు కలిసి తయారు చేశారు. 2011లో పోలాండ్‌లో రూపొందించబడిన 1.74 మీటర్ల ఎత్తున్న కేక్ పేరిట వున్న గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుని బద్దలుకొట్టే ఉద్దేశంతో ఈ కేక్‌ని రూపొందించారు. దాదాపు 30,000 మంది సమక్షంలో ఈ కేక్‌ని కట్ చేశారు. నరేంద్ర మోడీ బర్త్ డే సందర్భంగా ఆయనకి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో... గ్రామీణ మహిళల చైతన్యం, మహిళా సాధికారత కోసం పనిచేస్తోన్న శక్తి ఫౌండేషన్ అనే సంస్థ ఈ ఆలోచనకి శ్రీకారం చుట్టింది. ఇక అతుల్ బేకరీ విషయానికొస్తే, ఈ బేకరీకి సూరత్‌లో అనేక చోట్ల ఔట్‌లెట్స్ ఉండటమేకాకుండా అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాలకి కేక్స్ ఎగుమతి చేస్తోంది కూడా.
![]()
ప్రధాని మోడీ హాజరుకానున్న నవ్సరీ ర్యాలీ చోటుకే ఈ కేక్‌ని తరలించాల్సిందిగా ప్రధాని కార్యాలయం కోరింది. కానీ అప్పటికే గిన్నిస్ రికార్డుని దృష్టిలో పెట్టుకుని ఈ కేక్ కట్టింగ్‌కి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిపోయింది. అందుకే మోడీగారినే ఇక్కడికి రావాల్సిందిగా కోరాము. కానీ వారికున్న బిజీ షెడ్యూల్ కారణంగా అది సాధ్యపడలేదు అని తెలిపారు అతుల్ వెకారియా. మహిళా సాధికారత కోసం ప్రధాని మోడీ తీసుకొచ్చిన బేటీ బచావో.. బేటీ పడావో వంటి పథకాలని దృష్టిలో పెట్టుకునే ఆయనకి గౌరవసూచకంగా ఈ కేక్‌ని రూపొందించినట్టు అతుల్ తెలిపారు. ఈ కేక్ ముక్కలని సైతం బాక్సుల్లో పార్సిల్ చేసి వెనుకబడిన తరగతులకి చెందిన బాలికలకి పంపించనున్నట్టు అతుల్ చెప్పారు. వెయ్యిమంది గిటారిస్టులు ఈ వేడుకలో సంగీతం వినిపించగా.. ఓ 100 గిటార్లని బాలికలకి పంపిణీ చేసినట్టు అతుల్ పేర్కొన్నారు.
Mobile AppDownload and get updated news