జీవితంతో పోరాడటం అతనికి చిన్నప్పటినుంచీ అలవాటే. పేద కుటుంబంలో పుట్టిన అతను చిన్నా చితకా పపనులు చేస్తూనే చదువుకుంటూ మళ్లీ ట్యూషన్లు కూడా చెప్పేవాడు. మరో వైపు నాటకాల్లో నటించేవాడు. అలా క్రమేణా నాటకాల్లో పేరు తెచ్చుకుని టీవీ సీరియళ్లలో, సినిమాల్లో కూడా నటించటం మొదలుపెట్టాడు. ప్రతి నటుడు కలలు కనే గ్లోబ్ థియేటర్ లో రెండు సార్లు ప్రదర్శన ఇచ్చాడు. తాను కూడా అక్కడ ప్రదర్శన ఇవ్వలేకపపోయానని నువ్వు రెండు సార్లు ఇవ్వటం గ్రేట్ అని అమితాబ్ అంతటివాడే త్రివేదీని మెచ్చుకున్నారు. ఇలా జీవితంలో మంచి స్థాయికి చేరుకున్న దశలో క్యాన్సర్ సోకింది. అయినా ఎప్పుడూ నాకీ కష్టాలేమిటని కుంగిపోలేదు. క్యాన్సర్ తో కూడా పోరాడదాం పోయేదేముంది అనుకున్నాడు. పాజిటివ్ నెస్ పెంచుకోవటం, దాన్ని ఇతరులకు నేర్పటం కోసం ఇలా ఐ లవ్ యూ ప్రచారం చేపట్టి లక్షలమందికి చెప్పాడు. మెల్లగా అతనికి క్యాన్సర్ తగ్గిపోయింది. పరీక్షల అనంతరం డాక్టర్లు కూడా తగ్గినట్టు నిర్థారించారు. అతని పాజిటివ్ యాటిట్యూడే అతన్ని బతికించిందని ప్రశంసించారు.
ఇప్పడు వీలైంతమందిని ఐ లవ్ యూ ప్రచారంలో భాగం చేయటమే లక్ష్యంగా అర్చన్ త్రివేదీ ముందుకుసాగుతున్నాడు. ఆడవాళ్లకు ఐ లవ్ యూ చెబితే తన్నరా అని అడిగితే చెబుతున్నవారి యాటిట్యూడ్ వారికి తప్పక అర్థమవుతుందని అప్పుడ అపార్థం చేసుకోరని అంటున్నాడు. ఇంకేం మీరూ ఐ లవ్ యూతో రోజును మొదలుపెట్టండి మరి...(నవగుజరాత్ సమయ్ సౌజన్యంతో)
Mobile AppDownload and get updated news