నిజంగా ప్రభాస్ పెళ్లి ఎప్పుడో తెలియదు కానీ... ఆ పేరుతో సినిమా మాత్రం వచ్చేస్తోంది. ఆసక్తిని రేకెత్తించడానికే ప్రభాస్ పెళ్లి అని సినిమాకి పేరు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి 'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి'. ఆవుకి, పులికి ప్రభాస్ పెళ్లికి సంబంధం ఏమిటో సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది. ఇందులో కొత్త హీరో హీరోయిన్లు నటిస్తున్నారు. లీడ్ రోల్ లో మాత్రం బాహుబలిలో కాలకేయుడిగా మెప్పించిన ప్రభాకర్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఎస్ జే చైతన్య దర్శకుడిగా పనిచేస్తున్నాడు.
Mobile AppDownload and get updated news