సల్మాన్‌ను హిట్ అండ్ రన్ కేసు వదిలేట్టు లేదు. మొన్ననే ముంబయి హైకోర్టు సరైన ఆధారాలు లేవంటూ సల్మాన్ ను నిర్దోషిగా విడిచిపెట్టింది. ఆ బాలీవుడ్ కండల వీరుడు ఇక తాను ఆ కేసు నుంచి బయటపడినట్టేనని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వం ఆ కేసుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సుప్రీంలో బోంబే హైకోర్టు తీర్పును మహా ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేయనుంది. బుధవారం ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ 'ఆ కేసులో సుప్రీంకు వెళ్లాలో లేదో న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని' తెలిపారు. మధ్యాహ్నం న్యాయనిపుణులు సుప్రీంలో సవాలు చేయొచ్చని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2002, సెప్టెంబర్ 28న సల్మాన్ తాగిన మైకంలో కారును పుట్ పాత్ పై పడుకున్న జనాల మీద నుంచి పోనిచ్చాడు. ఈ సంఘటనలో ఒకరు చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడి జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు.
Mobile AppDownload and get updated news