Mobile AppDownload and get updated news
ఢిల్లీలో జరిగిన దళిత గిరిజన పారిశ్రామిక వేత్తల సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. అతను కేవలం రాజ్యాంగ పితామహుడే కాదని, గొప్ప ఆర్థికవేత్త కూడా అని అన్నారు. పారిశ్రామికీకరణ వల్ల దళితులకు ప్రయోజనం కలుగుతుందని అంబేద్కర్ అన్నారని, అది నూటికి నూరుపాళ్లు అందరూ ఒప్పుకోదగ్గ విషయమని అన్నారు. అలాగే తన ప్రభుత్వ లక్ష్యాల గురించి ఆయన మాట్లాడారు. ఉద్యోగాల కోసం వేచి చూసే వాళ్లని కాదు, ఉద్యోగాలని సృష్టించే వారిని తయారుచేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని చెప్పారు. అలాగే ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా 80లక్షల మంది బ్యాంకుల నుంచి రుణాలు పొందారని తెలిపారు. వారిలో దళితులు, గిరిజనులు ఎక్కువుగా ఉన్నట్టు చెప్పారు. పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడానికే తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.