Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85939

పోరాడి గెలిచిన ఛాంపియన్ బాక్సర్ 

$
0
0

క్రీడాకారుల జీవితం అంటేనే అత్యంత కఠినతరం. పగలు రాత్రి అనకుండా రేయింబవళ్లు కష్టపడితే కాని లక్ష్యం చేరటం అవదు. ఇక క్రీడాకారిణి జీవితం అంటే మరింత కష్టం. అటు కుటుంబాన్ని ఇటు కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకోవటం అంటే కత్తిమీద సాములాంటిది. ఇక రెండున్నరేళ్ల పిల్లవాడితో బాక్సింగ్ లాంటి కష్టమైన ఆటలో రాణించటం అంటే మరింత కష్టమైన విషయం. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారిణి లిసారాం సరితాదేవి. సరిత బాక్సింగ్ లో ప్రపంచ ఛాంపియన్, నాలుగు సార్లు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచింది. మేరీకోమ్ తో కలిసి టాయిసా పోటీలో విన్నర్ గా నిలిచింది. 15 ఏళ్లపాటు బాక్సింగ్ రింగ్ లోనే జీవితం గడిపింది. కుటుంబం, స్నేహితులు, చిన్నారి కొడుకు...ఇవేవీ ఆమె లక్ష్యసాధనకు అవరోధం కాలేదు. 2000 సంవత్సరంలో ఆమె బాక్సింగ్ కెరీర్ మొదలైంది. ఆసియా క్రీడోత్సవాల్లో అయిదు కేటగిరీల్లో బహుమతులు గెలవటంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఆమె గెలుచుకున్న మెడల్స్ లో 4 స్వర్ణాలు కావటం విశేషం. 2016 రియో ఒలంపిక్స్ లో పసిడి పతకం సాధించటమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతోంది. అందుకుగాను ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో కఠినంగా పరిశ్రమిస్తోంది. తన భర్త తన భర్త తోయిబా, మమూడేళ్ల కుమారుడు టామ్ థిన్ లతో వీకెండ్ లో మాత్రమే ఆమె గడుపుతోంది. స్టేడియంలో వాళ్లతో సేదతీరుతున్న ఆమెను టైమ్స్ ప్రతినిధి కలవగా బాక్సింగ్ పై తన ప్రేమ కుటుంబాన్ని మించిందని చెబుతూ తన అనుభవాలనను పంచుకున్నారు. ఆ వయసులో కుమారుడిని వదిలి ఉండటం కష్టమేనని అయితే కుటుంబం సహకారంతో దాన్ని అధిగమిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. తన కుమారుడు కూడా తనను అర్థం చేసుకున్నాడని తాను ట్రెయినింంగ్ కు టైమయిందని అనగానే ఏడవకుండా తండ్రితో కలిసి వెళ్లిపోతున్నాడని పేర్కొంది. జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్ అయిన తన భర్త తమ కొడుకును కూడా ఫుట్ బాల్ క్రీడాకారుడిని చేయాలని కోరుతున్నాడని పేర్కొంది. అందుకోసం అతనన్ని యూరోపియన్ అకాడెమీకి పంపాలని కలలు కంటున్నాడని చెప్పింది. తన కుమారుడు అప్పుడే హిందీ పాటలు పాడేస్తున్నాడని తనకు కూడా గుర్తుండని పదాలన్ని గుర్తుంచుకుని పాడటం చూసి తాను వీడు సింగర్ అయ్యేలా ఉన్నాడుకాని ప్లేయర్ అయ్యేలా లేడని తన భర్తను ఏడిపిస్తూ ఉంటానని పేర్కొంది. జనవరిలో క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు జరుగుతాయని అందులో 15నుంచి 20 మంది పోటీలో ఉన్నామని తెలిపింది. అక్కడ క్వాలిఫై అయితే మార్చిలో చైనాలో జరిగే పోటీలకు వెళతామని పేర్కొంది. రిటైర్మెంట్ గురించి ఇంకా నిర్ణయించుకోలేదని ఈలోగానే తాను మణిపూర్ లోని మయాంగ్ ఇంఫాల్లో బాక్సింగ్ ట్రెయినింగ్ ఇస్తానని పేర్కొంది. ''నేను ఈ రంగంలో ఒంటరిగా పోరాడాను. అందుకే నా తరువాతి తరం ఇబ్బందులు పడకుండా సాయం చేయాలనేది నా కోరిక'' అని ఆత్మవిశ్వాసం ఉట్టిపడేలా మెరిసే కళ్లతో చెప్పింది 30 ఏళ్ల ఈ బాక్సర్. ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్పి సెలవు తీసుకున్నాం.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85939

Trending Articles