వరంగల్ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఓరుగల్లు ఉప ఎన్నిక లో ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా..టీఆర్ ఎస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. వరంగల్ ప్రజలు జాతీయ పార్టీలను నమ్మే పరిస్థితిలో లేరని వెల్లడించారు. చెత్త సేకరణ సేకరణలో భాగంగా హైదరాబాద్ లో చెత్త సేకరణ కొనుగోలు చేసిన ఆటో ట్రాలీలను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ నెలాఖరు కల్లా ఇంటికి చెత్త బుట్టల పంపిణీ జరుగుతుందని వెల్లడించారు. ప్రతి ఇంటికి రెండు చొప్పున పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చెత్త తరలించేందుకు కొత్త ఆటో ట్రాలీలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో ఎక్కడా అపరిశుభ్రదతనేది కనబడకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం పథకం హైదరాబాద్ లో కూడా అమలు చేస్తున్నామని ..అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చాని వెల్లడించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న లక్ష మందికి ఇల్లు నిర్మించుకునేందుకు సర్టిఫెకెట్లు ఇచ్చామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
Mobile AppDownload and get updated news