సినీప్రముఖులు అధికంగా నివాసం వుండే జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద స్టార్స్ సందడి కనిపించింది. సినీనటుడు, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ, ఆయన కూతురు బ్రాహ్మణి, చంద్రబాబు భార్య భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మంచు మనోజ్, మంచు లక్ష్మీ,
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, ప్రసాద్ ఐ మ్యాక్స్ అధినేత రమేష్ ప్రసాద్, రాఘవేంద్ర రావు, నిర్మాత అశోక్ కుమార్, సురేష్ కొండేటి, పరుచూరి గోపాల క్రిష్ణ, మ్యూజిక్ కంపోజర్ వందేమాతరం శ్రీనివాస్ వంటి వాళ్లు జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రెండు కాళ్లు పూర్తిగా లేకున్నా.. ఓటు హక్కు వినియోగించుకుని, దాని విలువ ఏంటో తెలియచెప్పాలనే సంకల్పంతో ఓటింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసిన ఓ వ్యక్తిని అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎన్నికల అధికారులు అభినందించారు. శరీరం సహకరించకున్నా అతి కష్టంమీద పోలింగ్ కేంద్రానికి వచ్చి ఆయన ఓటు వేసిన తీరు తమ ఓటు హక్కు వినియోగించుకోని మరెందరికో దాని ప్రాధాన్యతని చాటిచెప్పింది.
Mobile AppDownload and get updated news