Mobile AppDownload and get updated news
నూతన నిర్మాణ సంస్థ "శివ రాజ్ ఫిల్మ్స్" పతాకంపై రూపొందుతున్న అహ్లాద భరితమైన హాస్య ప్రధాన ప్రేమ కథా చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా". ఏ.వి.ఎస్.రాజు సమర్పణలో సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ శిష్యుడు శివ రాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో "గీతాంజలి" ఫేం శ్రీనివాస్ రెడ్డి హీరో కాగా పూర్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. 90 % షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం "ఫస్ట్ లుక్" త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత శివ రాజ్ కనుమూరి మాట్లాడుతూ... "మన తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా ఉన్న కాల నేపధ్యంలో పూర్తి వినోద భరితంగా "జయమ్ము నిశ్చయమ్మురా" మలచడమైనది. కరీంనగర్ కుర్రాడికి కాకినాడలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అక్కడ అతనికి జరిగే పరిచయాలు, ఎదురయ్యే పరిణామాల సమాహారంగా రూపొందుతూ సహజ హాస్యానికి పెద్ద పీట వేస్తూ ఓ నగర పాలక సంస్థ కార్యాలయ నేపధ్యంలో జరిగే అందమైన ప్రేమ కథా చిత్రమే ఈ సినిమా. త్వరలో జరగబోయే ఆఖరి షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తవుతుంది. త్వరలోనే "ఫస్ట్ లుక్" లాంచ్ చేయబోతున్నాం" అని అన్నారు.