హైదరాబాద్: తెలంగాణ సీఎం గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఉదయం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. అనంతరం పలు అధికారిక కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం ఎల్లుండి కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేటాయింపుల గురించి కేంద్రం పెద్దలతో సీఎం చర్చలు జరపనున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమౌతున్న నేపథ్యంలో కేటాయింపుల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరనున్నారు.
Mobile AppDownload and get updated news