Mobile AppDownload and get updated news
జగపతిబాబు ఏం కొంటున్నారు? అని ఆలోచిస్తున్నారా... ఓ ఎకరం భూమి. అందులో వింతేముంది... సినీ స్టార్లంతా చేసే పని అదే కదా అంటారా... అవును నిజమే... కాకపోతే జగపతి బాబు కొన్నారంటే మనమో విషయం అర్థం చేసుకోవాలి. ఆయన ఆర్థికి పరిస్థితి చాలా పుంజుకుందని. మొన్నటి వరకు జూదానికి డబ్బు తగలేసి చాలా ఆర్థిక కష్టాల్లో, అప్పుల్లో కూరుకున్నారు. ఆ స్థితి నుంచి బయటికి వచ్చేందుకు అవకాశం వచ్చిన ప్రతి సినిమాను, క్యారెక్టర్ ను చేస్తూ ఇప్పుడు టాలీవుడ్ టాప్ విలన్ గా మారారు. అప్పుడు తీర్చడమే కాదు, జగపతి డబ్బు విషయంలో ఇప్పుడు బాగానే వెనుకేసుకున్నారని తెలుస్తోంది. విలన్ గా రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకు తీసుకుంటూ... మళ్లీ కష్టాల్లో పడకుండా స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ఆస్తకి చూపిస్తున్నారట. మహేష్ బాబు హైద్రాబాద్ చివర్లో ఓషన్ పార్క్ సమీపంలో మూడెకరాల స్థలం కొని దానిని ఫామ్ హౌస్ గా మారుస్తున్నాడు. ఆ స్థలం పక్కనే జగపతిబాబు ఓ ఎకరం కొనేందుకు చూస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం జగపతి చేతిలో ఎనిమిది సినిమాలు ఉన్నాయి.