తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక జరిగిన తొలి కార్పోరేషన్ ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో తెరాస విజయ బావుటా ఎగరేసింది. 150 డివిజన్లలో 99 స్థానాలు తెరాసవే కావడంతో మేయర్, డిప్యూటీ మేయర్... రెండు పదవులు తెరాసకే దక్కనున్నాయి. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటయ్యాక హైదరాబాద్ లో జరుగుతున్న తొలి మేయర్ ఎన్నికకు జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నిక కేవలం లాంఛనప్రాయమే. ఇప్పటికే మేయర్ ఎవరో అనధికారికంగా అందరికీ తెలుసు. చర్లపల్లి డివిజన్ నుంచి కార్పోరేటర్‌గా గెలిచిన బొంతు రామ్మోహన్ మేయర్ గా పదవిని చేపట్టబోతున్నారు. కాగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా బాధ్యతలు కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమ పార్టీ కార్పోరేటర్లకు నేటి ఉదయం అల్పాహార విందును ఇచ్చారు కేటీఆర్.
Mobile AppDownload and get updated news