సియాచిన్ మంచుగడ్డల్లో ఆరు రోజుల పాటూ కూరుకుపోయి కొనఊపిరితో ఆర్మీ కంటబడ్డాడు హనుమంతప్ప. మృత్యుంజయుడిగా పేర్కొంటూ అతడిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు ఆర్మీవైద్యులు. దేశమంతా హనుమంతప్ప బతకాలంటూ ప్రత్యేక పూజలు జరిగాయి. ఎన్నయినా చివరికి విధే గెలిచింది. హనుమంతప్ప గుండె ఆగింది. కొడుకు ఎప్పటికైనా తిరిగొస్తాడని ఆశగా చూసిన ధార్వాడా గ్రామం కన్నీటిసంద్రమైంది. గురువారం ఉదయం 11.45 నిమిషాలకు హనుమంతప్ప మరణించినట్టు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. దాదాపు పదిరోజుల పాటూ మృత్యువుతో పోరాడాడు ఈ ధీర జవాను. తన పదమూడేళ్ల సర్వీసులో సియాచిన్ లాంటి అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లోనే పదేళ్ల పాటూ పనిచేశాడు హనుమంతప్ప. 2015, ఆగస్టు నుంచి సియాచిన్ మంచు పర్వతాల్లో విధులు నిర్వహిస్తున్నాడు.
Mobile AppDownload and get updated news