ముంబై దాడి 26/11 కేసులో నిందితడు డేవిడ్ హెడ్లీ నాల్గో రోజు విచారణలో పలు అసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాడు. తనకు ఆర్ధిక సాయం చేసింది పాక్ సైన్యాధికారి అని బాంబు పేల్చిన హెడ్లీ.. తాజాగా లష్కరే తోయిబాకు మహిళా మానవ బాంబర్ల బృందం ఉందని వెల్లడించారు. అందులో గుజరాత్ కు చెందిన ఇష్రత్ జహాన్ లష్కరే మహిళా విభాగంలో సభ్యురాలిగా పనిచేసిందని వెల్లడించారు. లష్కరే సూసైడ్ బాంబర్లలో లో ఒకరి పేరు చెప్పాలంటూ ప్రాసిక్యూటర్ ప్రశ్నించగా వెంటనే హెడ్లీ ఇష్రత్ జహాన్ పేరును చెప్పాడు. 2004లో గుజరాత్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 19 ఏళ్ల ఇష్రత్ జహాన్ సహా మరో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన అప్పట్లో సంచనలం సృష్టించగా.. అది బూటకపు ఎన్ కౌంటర్ అంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తాజా విచారణలో హెడ్లీ చెబుతున్న వాఖ్యలతో వాస్తవాలు బయటికి వస్తున్నాయి.
Mobile AppDownload and get updated news