నటి మేనక కూతురు... కీర్తి సురేష్. 'నేను... శైలజ' సినిమాతో తెరంగేట్రం చేసి బంపర్ హిట్ కొట్టేసింది. అనంతరం అమ్మడికి అవకాశాలు వెల్లువలా తలుపుతట్టాయి. అయినా ఒక్క తెలుగు సినిమాలో కూడా బుక్ అయినట్టు వార్తలు వినిపించడం లేదు. కారణం... ఆమె వ్యవహార శైలేనట. జూ.ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి సినిమాలలో నటించడానికి కూడా కండిషన్లు పెడుతోందట. జూ.ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్', మహేష్-మురుగదాస్ సినిమాలోనూ నటించమని ఆఫర్లు వచ్చాయట అమ్మడికి. అయితే ఆమె కండిషన్లు విన్నాక... అవేవీ ఫైనల్ కాలేదని తెలుస్తోంది. సినిమా స్క్రిప్టులో తన పాత్ర గురించి మాత్రమే కాదు, మొత్తం స్ర్కిప్టు తనకు వినిపించాలని అడుగుతోందట. కథ మొత్తం హీరోకిలాగే తనకు చెప్పాలంటోందట. చిన్నచిన్న రొమాంటిక్ సీన్ చెప్పినా... వెంటనే దానిని కట్ చేసేయమంటోందట. వాళ్లమ్మ సలహా కూడా తీసుకోవడం లేదట. కథ వినేప్పుడు తాను మాత్రమే ఉంటోందట. ఆమె వ్యవహారశైలి నచ్చకే వచ్చిన ఆఫర్లు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయని టాక్. అయితే కోలీవుడ్ లో మాత్రం విజయ్ సరసన నటించబోతున్నట్టు సమాచారం.
Mobile AppDownload and get updated news