Mobile AppDownload and get updated news
తమిళనాడులో సంచలనం సృష్టించిన ముగ్గురు వైద్య విద్యార్థినుల అనుమానాస్పద మృతి కేసును మద్రాస్ హై కోర్టు సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటివరకు వారు ఆత్మహత్య చేసుకున్నారని అంతా భావించారు. అయితే చనిపోయిన ముగ్గురు విద్యార్థినుల్లో ఒకరైన మోనీషా మృతదేహానికి రీపోస్టుమార్టం జరిగిన సంగతి తెలిసిందే. అందులో బావిలో పడడానికి ముందే మోనీషా చనిపోయిందని, అది కూడా ఊపిరి ఆడకపోవడం వల్లే చనిపోయిందని తేలింది. ఊపిరి తిత్తుల్లో నీళ్లు చేరలేదని, అంటే ఆమె ప్రాణం బావిలో పడడం వల్ల జరుగలేదని పోస్టు మార్టం రిపోర్టు చెప్పింది. దాంతో హత్య కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరమైంది. కాగా మరో విద్యార్థిని శరణ్య తండ్రి తన కూతురి మృతదేహానికి కూడా రీపోస్టుమార్టం చేయాల్సిందిగా కోరుతూ కోర్టుకెళ్లారు. హైకోర్టు రీపోస్టుమార్టంకి ఆదేశించింది.