హృదయకాలేయం, కొబ్బరిమట్ట అంటూ... వింత సినిమా పేర్లతో మనముందుకు వచ్చిన సంపూర్ణేష్ బాబు... అలీకి ఎసరు పెట్టినట్టు కనిపిస్తున్నాడు. సినిమాలలో పెద్దగా అవకాశాలు చేజిక్కించుకోకపోయినా.... మా టీవీ సినీ అవార్డుల ఈవెంట్ కు అతనే సుమతో కలిసి యాంకరింగ్ చేయబోతున్నాడనే సమాచారం వస్తోంది. నిజానికి ప్రతి ఏడాది సుమ, అలీలు ఈ మెగా ఈవెంట్ కు వ్యాఖ్యతలుగా ఉంటారు. వీరిద్దరిపై ఓ స్పూఫ్ కూడా ముందుగా షూట్ చేస్తారు. ఈసారి కూడా స్పూఫ్ షూటింగ్ అయిపోయింది. అయితే అందులో సుమతో పాటూ సంపూర్ణేష్, పృథ్వీలు కనిపిస్తున్నారు. సుమ శివగామిగా, సంపూర్ణేష్ బాహుబలి, కాలకేయుడిగా, పృథ్వీ కట్టప్పగా కనిపిస్తున్నారు. ఈ వీడియో బిట్ ను మాటీవీ తమ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. ఇది నెటిజన్లను త్వరగా ఆకట్టుకుంది. దీనిని బట్టి చూస్తే యాంకరింగ్ కూడా వీళ్లే చేస్తారా అన్న అనుమానం కలుగుతోంది.
Mobile AppDownload and get updated news