ప్రభుత్వ ప్రత్యేక సైనిక దళంలో పనిచేసిన వేడ్ విల్సన్ (ర్యాన్ రెనాల్డ్స్) ఆ ఉద్యోగాన్ని వదిలేసి.. కిరాయి హంతకుడిగా మారతాడు. ఈ దశలో వన్నెస్సా అనే వేశ్యతో పరిచయమవుతుంది. ఒకరంటే ఒకరికి అభిమానం, ప్రేమ కలుగుతాయి. ఇద్దరూ కలిసి బతకాలనుకునే దశలో వేడ్‌విల్సన్ కేన్సర్ బారినపడతాడు. వ్యాధి చికిత్స కోసం వెళ్తే.. అక్కడ ఓ సైంటిస్ట్ అతనిపై ఓ ప్రయోగం చేస్తాడు. ఆ ప్రయోగం కాస్తా వికటించి.. సూపర్‌మ్యాన్‌గా మారతాడనుకున్న విల్సన్.. మరింత తీవ్రమైన అనారోగ్యానికి లోనవుతాడు! పూర్తిగా రంగు.. రూపు పోయి.. మాంసం ముద్దలా.. తయారవుతాడు! దీంతో అతన్ని డెడ్ పూల్ గా వ్యవహరిస్తారు. ప్రయోగం అనంతరం ఒంటికి ఎలాంటి గాయమైనా క్షణాల్లో మానిపోయే అద్భుత శక్తి అతనికి సమకూరుతుంది! వాళ్ల స్వార్థం కోసం కావాలనే తనను బలిపశువు చేశారని తెలుసుకుని.. తన జీవితాన్ని సర్వనాశనం చేసిన వాళ్లపై ఎలా పగ సాధించాడన్నదే.. ఈ 'డెడ్‌పూల్' సినిమా కథ. డెడ్‌పూల్ శత్రువులపై ఎలా పగ సాధించాడన్నది వెండితెరపై చూడాల్సిందే.
రేటింగ్: 4\5
Mobile AppDownload and get updated news