నటీనటులు: ఆదిత్య రాయ్ కపూర్.. కత్రినా కైఫ్.. టబు సంగీతం: అమిత్ త్రివేది, సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి, దర్శకత్వం: అభిషేక్ కపూర్ చార్లెస్ డికెన్స్ రాసిన అద్భుతమైన ప్రేమకావ్యం 'గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్' నవల ఆధారంగా దర్శకుడు అభిషేక్ కపూర్ తెరకెక్కించిన చిత్రం 'ఫితూర్'. ఆదిత్య రాయ్ కపూర్.. కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ ప్రేమకథ కాశ్మీర్ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. నూర్(ఆదిత్య రాయ్ కపూర్) కశ్మీర్‌లోని తన అక్క.. బావ ఇంట్లో ఉంటాడు. అదే వూర్లో కులీన వంశానికి చెందిన బేగమ్ హజ్రత్(టబు) కుటుంబం నివాసం ఉంటుంది. ఓ రోజు బేగమ్ బంగ్లాకు మరమ్మత్తులు చేసేందుకు నూర్ వెళతాడు.అక్కడ బేగమ్ కూతురు ఫిర్దౌసి(కత్రినా కైఫ్) తారసపడుతుంది. తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఫిర్దౌసి మాత్రం పైకి ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయదు. అయితే నూర్ అంటే ఇష్టం ఉందని మనం అనుకునేలా ఆమె హావభావాలు ఉంటాయి. అనంతరం ఫిర్దౌసీ చదువుకోసం లండన్ వెళుతుంది.నూర్ కూడా ఢిల్లీ వెళ్లి అక్కడ కళాకారుడిగా మంచి పేరు తెచ్చుకుంటాడు. తిరిగి వీరిద్దరూ ఒకరికొకరు తారసపడతారు. ఆమె పట్ల తన ప్రేమ ఎప్పటిలాగే ఉందని నూర్ గ్రహిస్తాడు. ఫిర్దౌసీ కూడా తనను ఇష్టపడుతుందని అనుకుంటాడు. ఇంతలో ఫిర్దౌసీ పాకిస్థాన్ కు చెందిన బిలాల్ అననే రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు నూర్ కు తెలుస్తుంది. అప్పడు నూర్ ఏం చేస్తాడు? ఫిర్దౌసీ అతన్ని అసలు ప్రేమిస్తోంది లేదా? ఆమెతో అతనికి పెళ్లవుతుందా?బేగం హజరత్ కు నూర్ పై కోపానికి కారణం ఏమిటి? అనేది వెండితెరపై చూడాలి డికెన్స్ నవలలోని పిప్ పాత్రలో ఆదిత్య రాయ్ కపూర్, మిస్ హావిషామ్ పాత్రలో టబు, ఎస్టెల్లా పాత్రలో కత్రినా మనకు ఇండియనైజ్ చేసిన పాత్రలు, కథలో కనిపిస్తారు. చిత్రం మొత్తంలో హీరోయిన్ అని పేరే కాని ఎక్కడా కత్రినా మొహంలో హావభావాలు కనబడవు. ఆమెకు నూర్ అంటే అసలు ఇష్టమేనా అనేది కూడా తెలియదు. ఈ ససినిమాలో చేయటం ఆమెకు ఇష్టం లేదేమో అన్నట్లు ఉంది ఆమె నటన. ఆదిత్య, టబు చాలా బాగా నటించినా స్క్రీన్ ప్లే పేలవంగా ఉండి ఎందుకూ పనికి రాకుండా పోయింది. సినిమాటోగ్రాఫర్ అనయ్ గోస్వామి మాత్రం కాశ్మీర్ అందాలను మన ముందు అద్భుతంగా అందమైన పెయింటింగ్ లా నిలబెట్టాడు. సంగీతం కూడా బాగుంది. అయినా సరే సినిమా మాత్రం ఎక్స్పెక్టే షన్స్ కు తగినట్లు ఎంతమాత్రం లేదనే చెప్పాలి.
రేటింగ్: 2\5
Mobile AppDownload and get updated news