Mobile AppDownload and get updated news
సంచలనానికి కేరాఫ్ అడ్రస్ ఎవరూ అంటే రామ్ గోపాల్ వర్మే అంటారంతా. ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏం ట్వీటినా సంచలనమే. తాజాగా బెజవాడ ఫ్యాక్షన్‌ను మళ్లీ తెరమీదకు తెస్తానని చెప్పాడు. వంగవీటి రంగా సినిమాను తెరకెక్కిస్తానని... అదే తన చివరి తెలుగు సినిమా అని ప్రకటించాడు. అప్పటి నుంచి ఆ సినిమా తీయవద్దంటూ ట్వీట్ చేస్తున్నవాళ్లు, విమర్శించే వాళ్లు, వార్నింగ్ ఇస్తున్న వాళ్లు వస్తున్నారు. ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండేందుకు వర్మ ఇలా చేస్తారంటూ ఎద్దేవా చేసే వాళ్లు ఎక్కువే. వీటన్నింటి నేపథ్యంలో వర్మ ఘాటుగా స్పందించాడు. చాలు ఆపండి... అందరూ నాకు చెప్పేవాళ్లే... అంత బాధ్యత లేకుండా సినిమాలు తీస్తానా? అంటూ గుస్సా అవుతున్నాడు. వంగవీటి సినిమా తీయద్దనడం నాన్ సెన్స్ మాటలు... నాకు రంగా గురించి వాళ్లింట్లో వాళ్ల కన్నా బాగా తెలుసు... కాబట్టి సలహాలు ఇవ్వద్దు అని సమాధానాలు ఇస్తున్నాడు. అసలు సినిమా మొదలవ్వకుండా... అందులో ఏ సన్నివేశాలు ఉండొచ్చో... అవి ఇబ్బంది కలిగిస్తాయా? కలిగించవా ఎలా చెబుతారు.... అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా నాకు తోచింది, నచ్చింది నేను చేస్తా... ఎవరి మాట వినను... అని తేల్చి చెప్పేశాడు వర్మ. అంటే వంగవీటి రంగా సినిమా త్వరలో వచ్చేస్తుందన్న మాట.