Mobile AppDownload and get updated news
మనవాళ్లు వన్డేల్లో కుప్పకూలినా చిట్టి మ్యాచ్‌లైన టి.ట్వంటీల్లో మాత్రం రెచ్చిపోతారు. మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ఓడిపోయి, టిట్వంటీ సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా శ్రీలంకతో స్వదేశంలో ఆడుతున్న పొట్టి క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నారు. రాంచీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ను చిత్తుగా ఓడించారు. మొదట బ్యాట్ తో, తరువాత బాల్ తో విరుచుకుపడ్డారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 197 పరుగుల భారీ లక్ష్యాన్ని లంక ముందుంచింది. నిర్ణీత ఓవర్లలో శ్రీలంక కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధావన్ 25 బంతుల్లో 51 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఈ విజయంతో సిరీస్ లో స్కోరు సమం అయింది. శ్రీలంక ఒక విజయాన్ని, భారత్ ఒక విజయాన్ని నమోదు చేసుకున్నాయి.