తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మళ్లీ చలనం కనిపించింది. కొన్ని నెలల పాటూ ఎలాంటి కదలిక లేకుండా... ఏమైందో తెలియని స్థితిలో ఆగిపోయింది ఈ కేసు. అయితే హఠాత్తుగా టి.అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసులో నాలుగో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరూసలేం మత్తయ్యకు నోటీసులు ఇష్యూ చేశారు. హైదరాబాద్ లోని ఉప్పల్ లోని ఆయన ఇంటికి వెళ్లి తాఖీదులు అతికించి వచ్చారు. వారంలోగా బంజారాహిల్స్ లోని తమ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. తాము అరెస్టు చేయబోమని హామీ ఇచ్చారు. అలాగే ఈ కేసులో సంబంధమున్నట్టు భావిస్తున్న ఓ నగర ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Mobile AppDownload and get updated news