వాలెంటైన్ డే అనగానే రకరకాల గిఫ్టులు, పువ్వులు, చాక్లెట్ లు ఇవ్వటం మాత్రమేనా? ఈ రోజుల్లో యువతీ యువకులకు ఫోన్ మించిన మంచి గిఫ్ట్ ఏముంటుంది? మీ లవర్ కు స్పెషల్ గిఫ్ట్ అది కూడా ప్రతిరోజూ దాన్ని చూడకపోతే రోజు గడవదు అనేట్లు ఉండేది ఇస్తే ఎలా ఉంటుంది? ఐడియా అదిరిపోయింది కదూ? అదే ఐడియా ఐఫోన్ తయారీదారులకు కూడా వచ్చింది. ప్రేమికులకోసం ప్రత్యేకంగా ఫోన్లు తయారుచేసి ఇస్తామని వాలంటైన్ డే గిఫ్ట్ గా ఇవ్వవచ్చని ప్రకటించింది. ఎవరి బడ్జెట్ కు తగినట్లు వాళ్లు ముస్తాబుచేయించుకోవచ్చట. కస్టమైజ్ ఫోన్లన్న మాట. అయితే బేసిక్ మోడలే 7 లక్షల నుంచి ఉందట. ఆ పైన మీ ఓపిక...22 కోట్ల వరకు ఉన్నాయి.అంత ఖరీదు ఎందుకంటే వాటిని 24 కేరట్ల బంగారంతో వజ్రాలు పొదిగి చేస్తారు. ఎల్లో, పింక్, ప్లాటినం రంగుల్లో ఉంటాయి. ఐఫోన్ 6 మోడల్ ను ఇలా ముస్తాబు చేసి ఇస్తారట. ఇంకేం మరి మీరు సౌండ్ పార్టీ అయితే ఈ గిఫ్ట్ కు వెళ్లిపోండి....
Mobile AppDownload and get updated news